ట్రిపుల్ ‘ఆర్’ కు ఏపీ సర్కార్ శుభ ‘వార్త’
ప్రభుత్వ జీవో ప్రకారం టికెట్ ధరలు పెంచుకోవచ్చు-మంత్రి పేర్ని నాని వెల్లడి

Amaravati: ట్రిపుల్ ‘ఆర్’ సినిమాకు ఏపీ సర్కార్ శుభ ‘వార్త ‘ చెప్పింది. మొదటి 10 రోజుల వరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం టికెట్ ధరలు పెంచుకోవచ్చని పేర్కొంది. ఇదిలావుంటే , ట్రిపుల్ ఆర్ సినిమాకు రూ.336 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. భారీ బడ్జెట్ సినిమాకు మొదటి మూడు నాలుగు రోజుల్లోనే కలెక్షన్లు వచ్చేట్లు డిస్ట్రిబ్యూటర్లు టికెట్ ధరలు పెంచుకుంటారని.. ఇదే సమయంలో ప్రజలపై కూడా భారం పడకుండా చూడటం ప్రభుత్వ విధి అన్నారు.
ఇటు ప్రేక్షకులు, అటు సినిమా రంగానికి ఎవ్వరికీ ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు. త్వరలో ట్రిపుల్ ఆర్ ధరఖాస్తును స్క్రూటినీ చేసి దానికి అదనంగా ఎంత ఇవ్వడం అనేదానిపై జీవో ఇస్తామని వెల్లడించారు.
సినిమాకు ఎంత ఖర్చు అయిందనే వివరాలను స్క్రూటిని చేసిన తర్వాతే టికెట్ ధరలపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఆన్ లైన్ టికెట్ కోసం రెండు కంపెనీలు టెండర్లు వేశాయని, థియేటర్లలో 5 ఆటలు ప్రదర్శించే అవకాశం ఉందని.. అయితే పెద్ద సినిమా రిలీజ్ రోజు రూ. 20 కోట్ల బడ్జెట్ ఉన్న చిన్న సినిమాకు ఒక ఆట తప్పనిసరిగా కేటాయించాలని ఆయన అన్నారు. రానున్న సినిమాలు ఏపీలో 25 శాతం షూటింగ్ చేయాలని మంత్రి నాని వెల్లడించారు.
తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/