ట్రంప్ సవతి ప్రేమ
అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా విమర్శ

Washington: కేవలం వ్యక్తిగత స్వార్ధం, మిత్రుల లబ్దికోసమే ట్రంప్ మరోసారి అధ్యక్షపీఠాన్ని దక్కించుకోవాలని ప్రయతిస్తున్నారని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆరోపించారు.
అమెరికాలో తొలిసారిగా ఓ మాజీ అధ్యక్షుడు నూతన అధ్యక్షత అభ్యర్థి తరఫున ప్రచారం జరగటం విశేషం.. తమపార్టీకి చెందిన జోబైడెన్‌కు మద్దతుగా ఒబామా ప్రచారం చేస్తున్నారు.
ఆదివారం ఇక్కడి ఫ్లోరిడా , మియామీ ప్రాంతాల్లో జరిగిన ర్యాలీలో ఆయన ట్రంప్‌పై నిప్పులు చెరిగారు. కరోనా వైరస్ ను అరికట్టడంలో ట్రంప్ అవలంభించిన విధానాలు విఫలమయ్యాయని అన్నారు.
సరైనా ప్రణాళిక లేకపోవటంతో లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోవటానికి కారణమయ్యారని ఒబామా దుమ్మెత్తిపోశారు.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/