పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన

ప్రధాని మోడీ, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు

Parliament of India
Parliament of India

న్యూఢిల్లీః జీఎస్టీ, అధిక ధరలు, ద్రవ్యోల్బణంపై రాజ్యసభలో నిరసనలు తెలిపిన వారిపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని టీఆర్ఎస్ ఎంపీలు బుధవారం పార్లమెంట్ ఆవరణలో గాంధీ గారి విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిని సస్పెండ్ చేయడం అన్యాయం అన్నారు.

రాజ్యసభలో సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారని, బిగ్గరగా నినాదాలు చేస్తున్నారంటూ మంగళవారం 19 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ విధించారు. వీళ్లపై సస్పెన్షన్ ఈ వారాంతం వరకు కొనసాగనుంది. సస్పెండైన వారిలో టీఆర్ఎస్ ఎంపీలు లింగయ్య యాదవ్, రవీంద్ర వద్దిరాజు, దీవకొండ దామోదర్ రావు కూడా ఉన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/