ధనుష్ ‘సార్’ ఫస్ట్ లుక్ రిలీజ్..

తమిళ స్టార్ హీరో నటిస్తున్న ద్విభాషా చిత్రం‌ ‘సార్‌’ (తెలుగు)/ ‘వాతి’ (తమిళం). వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. జులై 28న ఆయన పుట్టిన రోజు సందర్భంగా మూవీ మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ లో ధనుష్ ఓ లైబ్రరీలో కూర్చొని శ్రద్ధగా, దీక్షగా రాసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఆయన ఇదంతా ఎందుకు చేస్తున్నారు, దేనికి సిద్ధమవుతున్నారు లాంటి ప్రశ్నలన్నింటికీ ‘సార్’ సమాధానం వెండితెర మీద చూడాల్సిందేనని చిత్ర నిర్వాహకులు చెపుతున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించిన ధనుష్ పుట్టినరోజు నాడు అనగా రేపు సాయంత్రం 6 గంటలకు వీడియో చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై యువ నిర్మాత నాగవంశి నిర్మిస్తున్న ‘సార్’ సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంటుంది. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండటం తో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో ధనుష్ ఒక ఉపాధ్యాయుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల”యాన్ యాంబిషియ‌స్ జ‌ర్నీ ఆఫ్ ఎ కామ‌న్ మ్యాన్” స్లోగన్ తో ఈ చిత్రానికి సంబంధించి విడుదల అయిన టైటిల్ రివీల్ వీడియో ఒక ఉద్వేగ‌భ‌రిత‌మైన, ఉత్తేజ‌క‌ర‌మైన‌ క‌థ‌ను ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌న ముందు ప్రెజెంట్ చేయ‌నున్నార‌నే న‌మ్మ‌కం కలిగించింది. మరి రేపు టీజర్ ఎలా ఉండబోతుందో చూడాలి.