రాహుల్ ఫై కేటీఆర్ విమర్శలు

భారత్ జోడో యాత్ర లో భాగంగా సోమవారం రాహుల్ మీడియా తో మాట్లాడుతూ..కేసీఆర్ జాతీయ పార్టీ ఫై పలు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్స్ ఫై కేటీఆర్ రాహుల్ ఫై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసారు. రాహుల్ గాంధీ త‌న స్వంత పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అమేథీలోనే గెలువలేకపోయారు..అలాంటి వ్యక్తి జాతీయ పార్టీ ఆశ‌యాల‌తో ముందుకు వెళ్తున్న సీఎం కేసీఆర్‌ను విమ‌ర్శించే హ‌క్కు లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి కావాలనుకుంటున్న రాహుల్ గాంధీ.. ముందుగా ప్ర‌జ‌ల్ని ఒప్పించి స్వంత నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీగా గెల‌వాల‌ని కేటీఆర్ సెటైర్ వేశారు.

ఇక మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగుస్తుండడం తో చివరి రోజు మునుగోడు లో మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు లు పలు రోడ్ షో లు చేస్తూ..ఓటర్లను ఆకట్టుకునే పని ఉన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నారాయణపూర్ మండల కేంద్రంలో రోడ్ షోలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు మునుగోడు పట్టణంలో రోడ్ షో నిర్వహించనున్నారు.