బీజేపీ నేతల పై ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి విమర్శలు

హైదరాబాద్ : బీజేపీ ఎంపీలు రాష్ట్ర సమస్యల కోసం ఎన్నడూ కేంద్ర మంత్రులను కలవలేదని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. మేకిన్‌ ఇండియాను బుల్డోజర్‌ ఇండియాగా మార్చారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీపై రాజకీయ బుల్డోజర్లు ఎక్కిస్తామని హెచ్చరించారు. విపక్ష నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే తరిమి కొడతామని వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర నిధులపై మంత్రి కేటీఆర్‌ రెండు రోజుల క్రితం సవాల్‌ విసిరారని, దానికి సమాధానమివ్వకుండా బీజేపీ ఎంపీలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎంపీ అరవింద్‌ బాండ్‌ పేపర్‌ రాసిచ్చి పసుపు రైతులను అవమానించారని ఆగ్రహించారు. ఎంపీ అరవింద్‌ దొంగల సంఘానికి నాయకుడని విమర్శించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/