దావోస్ స‌ద‌స్సుకు హాజరు కానున్న మంత్రి కేటీఆర్

ఆస‌క్తి రేకెత్తించే వీడియోను విడుద‌ల చేసిన టీఆర్ఎస్‌

హైదరాబాద్: దావోస్ వేదిక‌గా వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం స‌ద‌స్సు ఆదివారం ప్రారంభం కానుంది. ఈ స‌ద‌స్సుకు హాజ‌ర‌వ‌డం ద్వారా ప్ర‌పంచ దిగ్గ‌జ సంస్థ‌ల పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టేందుకు ఆయా దేశాలు, రాష్ట్రాలు త‌మ ప్ర‌తినిధి బృందాల‌ను దావోస్ పంపిస్తున్నాయి. స‌ద‌స్సుకు ఒక్క రోజు మాత్ర‌మే గ‌డువు ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఆయా ప్ర‌భుత్వాల ప్ర‌తినిధి బృందాలు దావోస్ చేరుకున్నాయి కూడా. ఏపీ ప్ర‌తినిధి బృందంతో పాటు దానికి నేతృత్వం వ‌హిస్తున్న సీఎం జ‌గ‌న్ కూడా దావోస్ చేరుకుంటున్నారు.

ఇక ఈ స‌ద‌స్సుకు తెలంగాణ త‌ర‌ఫున ఆ రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ హాజ‌ర‌వుతున్నారు. ఇప్ప‌టికే లండ‌న్ టూర్‌లో ఉన్న ఆయ‌న అటు నుంచి అటే దావోస్ వెళ్ల‌నున్నారు. స‌ద‌స్సుకు హాజ‌రు కానున్న తెలంగాణ ప్ర‌తినిధి బృందానికి ఆయ‌న నేతృత్వం వ‌హించ‌నున్నారు. కేటీఆర్ దావోస్ స‌ద‌స్సుకు సంబంధించిన టూర్‌పై ఆస‌క్తి రేకెత్తించే ఓ వీడియోను కూడా విడుదల చేసింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/