ఎట్టకేలకు కరోనా నుండి కోలుకున్న డైరెక్టర్.. ఎవరో తెలుసా?

టాలీవుడ్‌లో ఇప్పటికే పలువురు స్టార్స్ కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. కాగా కరోనా సోకకుండా ఎందరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కరోనా మాత్రం విజృంభిస్తూనే ఉంది. అయితే ఓ స్టార్ డైరెక్టర్‌కు కరోనా సోకి రెండు వారాలు కావస్తున్నా, ఈ విషయం చాలా తక్కువ మందికి తెలిసింది. టాలీవుడ్‌లో మాటల మాంత్రికుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు కొద్ది రోజుల క్రిందట కరోనా సోకింది.

అప్పటి నుండి ఆయన ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. కాగా ఎట్టకేలకు ఆయనకు తాజా కోవిడ్ టెస్టుల్లో నెగెటివ్ అని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఓ స్టార్ డైరెక్టర్‌కు కరోనా సోకినా, ఈ వార్త ఎందుకు ఇండస్ట్రీ వర్గాల్లో పెద్దగా చూపించలేదని పలువురు మండిపడుతున్నారు. ఏదేమైనా త్రివిక్రమ్ కరోనా నుండి కోలుకోవడం సంతోషంగా ఉందని ఆయన అభిమానులు అంటున్నారు. ఇక గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి ఓ సినిమాను స్టార్ట్ చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు ఆ సినిమాను పక్కనబెట్టినట్లు తెలుస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేసేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఉంటుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఈ స్టార్ డైరెక్టర్ తన నెక్ట్స్ మూవీని ఎవరితో తీస్తాడా అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ టాలీవుడ్‌గా మారింది.