తెలంగాణలో ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ ధర రూ.295

రీసెంట్ గా తెలంగాణ రాష్ట్ర సర్కార్ రాష్ట్రంలో మూవీ టికెట్స్ ధరలు పెంపుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో థియేటర్స్ యాజమాన్యం భారీగా టికెట్స్ పెంచేశారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టికెట్ ధరల వివరాలను అధికారికంగా ప్రకటించారు ఫిలిం ఛాంబర్. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం టికెట్ ధర సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.175, మల్టీప్లెక్స్ ల్లో రూ.295 ఉంటుందని తెలిపింది. ఇది రెండు వారాల వరకు ఇలాగే ఉంటాయని..ఆ తర్వాత ధర తగ్గుతుందని ‘ఏషియన్ సినిమాస్’ అధినేత సునీల్ నారంగ్ తెలిపారు.

పెద్ద సినిమాలకు రేట్లు ఎక్కువగా ఉన్నా, చిన్న సినిమాలకు మాత్రం తక్కువ రేట్లు ఉండేలా చూస్తామని తెలిపారు. చిన్న సినిమాలకు మినిమమ్ ప్రైజ్, మీడియమ్ సినిమాలకు వారంపాటు మ్యాక్జిమమ్ ప్రైజ్, పెద్ద సినిమాలకు రెండు వారాలు మ్యాక్జిమమ్ ప్రైజ్ ఉండేలా చూస్తామన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత విడుదలయ్యే చిన్న సినిమాల‌కి టికెట్ ప్రైజ్ తక్కువగానే ఉంటుందని తెలిపారు.

తెలుగు విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఇందులో తారక్.. కొమరం భీం, చరణ్.. అల్లూరిగా నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా జనవరి 07 వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అలాగే, టర్కిష్, స్పానిష్, పోర్చుగీస్, కొరియన్, జపనీస్, చైనీస్, ఇంగ్లీష్ భాషల్లో కూడా దీన్ని డబ్బింగ్ చేయబోతున్నారు.