డార్జిలింగ్​ జిల్లాలో దారుణం : గిరిజన మహిళను వివస్త్రను చేసి కొట్టారు

దేశంలో గిరిజనులపై రోజు రోజుకు దాడులు ఎక్కువైపోతున్నాయి. ప్రతి రోజు దారుణ సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ పక్క మణిపూర్ లో దాడులకు సంబదించిన వీడియో లు సోషల్ మీడియా లో బయటకు వస్తూ సభ్యసమాజం తలదించుకునేలా చేస్తుంటే..తాజాగా డార్జిలింగ్​ జిల్లాలో ఓ గిరిజన మహిళను వివస్త్రను చేసి కొట్టిన ఘటన వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే..

డార్జిలింగ్​ జిల్లాలోని లోయర్ బాగ్‌దోగ్రా పరిధిలోని భుజిపాని గ్రామానికి చెందిన రోష్ని ఖేర్వార్ అనే మహిళకు ప్రదీప్ సర్కార్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంలో గొడవ జరగడం వల్ల.. జులై 19న ఈ విషయంపై భుజిపానిలోని పంతబరి ప్రాథమిక పాఠశాలలో పంచాయతీ జరిగింది. ఆ సమయంలో ప్రదీప్ సర్కార్ భార్య గౌరీ సర్కార్.. రోష్ని ఖేర్వార్‌తో గొడవ పడింది. ఇరువర్గాలను విడదీసే ప్రయత్నంలో బాధిత మహిళ కూడా రోష్నీతో గొడవకు దిగింది. ఈ క్రమంలో రోష్నీ ఖేర్వార్​.. బాధితురాలిపై కోపం పెంచుకుంది. తెల్లారి పంచాయితీ జరుగుతుండగా..పెద్దమనుషుల ముందే రోష్నీ ఖేర్వార్​, తన సన్నిహితులు కలిసి.. బాధితురాలిని వివస్త్రను చేసి దాడి చేశారు. ఇంత దారుణం జరుగుతున్న అక్కడున్న పెద్ద మనుషులు , స్థానికులు ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటన తర్వాత బాధితురాలు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేసింది. తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని నిందితులు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.