వలస కూలీల ప్రయాణం విషాదం: ఏడుగురి గల్లంతు
చిన్నారి మృతదేహం గుర్తింపు

Sileru (Visakha District): వలస కూలీల ప్రయాణంలో విషాదం జరిగింది. తెలంగాణలో లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సొంత రాష్ట్రం ఒడిశా వెళ్లిపోవాలని 11 మంది వలస కూలీలు గత అర్ధరాత్రి విశాఖ జిల్లా సీలేరుకు చేరుకున్నారు. అక్కడి నుంచి వీరు రెండు నాటు పడవల్లో బయలుదేరగా , వారి పడవలు ఒక్కసారిగా నీట మునిగాయి. మొత్తం 11 మంది మునిగిపోయారు. వీరిలో ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు వచ్చారు. .సేపటికి చిన్నారి మృతదేహం లభ్యమైంది. గల్లంతైన మిగతా ఏడుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/