ముంబై లీలావ‌తి హాస్పటల్ ఏపీ మంత్రి విశ్వరూప్‌..

ఏపీ మంత్రి విశ్వరూప్‌ కు..ముంబై లీలావ‌తి హాస్పటల్ లో చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 2న వైఎస్సార్ వ‌ర్థంతి కార్య‌క్ర‌మాల్లో పాలుపంచుకున్న సంద‌ర్భంగా అనారోగ్యానికి గురైన విశ్వ‌రూప్ రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ప్రాథమిక చికిత్స అనంత‌రం హైద‌రాబాద్‌లో వైద్యం చేయించుకున్నారు.

మ‌రోమారు ఆయన అనారోగ్యానికి గురికావడంతో.. మెరుగైన వైద్య చికిత్స‌ కోసం ఆయ‌న‌ను ముంబై లీలావతి హాస్పటల్ కు తరలించారు. విశ్వ‌రూప్‌కు సోమ‌వారం ముంబైలోని లీలావ‌తి ఆసుప‌త్రిలో ఆప‌రేష‌న్ మొద‌లైంది. ఈ ఉద‌యం 10 గంటలకు విశ్వ‌రూప్ గుండెకు మొద‌లైన ఆప‌రేష‌న్ గంట‌ల త‌ర‌బ‌డి కొన‌సాగుతోంది. సాయంత్రం 5 గంట‌లు దాటినా విశ్వ‌రూప్‌కు ఆప‌రేష‌న్ ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం ఆయనకు గుండె ఆపరేషన్ కొనసాగుతుంది.

సెప్టెంబరు 2న వైస్సార్ వర్థంతి సందర్భంగా అమలాపురంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పట్టణంలో వైస్సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. ఎడమ చేయి, ఎడమ దవడ లాగడంతో పాటు శరీరంలో చాలా నీరసంగా అనిపించింది. కార్యకర్తలు ఆయన్ను మొదట రాజమండ్రి లోని బొల్లినేని ఆస్పత్రికి తరలించారు. మంత్రి విశ్వరూప్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. నరాల సంబంధిత సమస్యతో ఆయన బాధపడుతున్నట్లు తెలిపారు. ప్రాథమికి చికిత్స అనంతరం హైదరాబాద్‌కు పంపించారు. సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స అనంతరం.. హార్ట్ సర్జరీ కోసం ముంబై వెళ్లారు విశ్వరూప్.