జనసేన క్రియాశీలక వీరమహిళలకు రేపు శిక్షణా తరగతులు

శిక్షణా తరగతులను రేపు ప్రారంభించనున్న పవన్ కల్యాణ్

nagababu-inspects-janasena-political-training-classes

మంగళగిరి : రేపు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో’జనసేన క్రియాశీలక వీరమహిళల’కు రాజకీయ శిక్షణా తరగతులు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు శిక్షణా తరగతులు ఏర్పాట్లను ఈరోజు పర్యవేక్షించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల వీర మహిళలకు శిక్షణా తరగతులను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఈ తరగతులను రేపు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. జనసేన రాజకీయ వ్యవహారాల్లో మహిళలకు గౌరవప్రదమైన స్థానాన్ని అందించాలని ఆకాంక్షించే పవన్ కల్యాణ్ ప్రారంభిస్తున్న శిక్షణా తరగతులను వినియోగించుకోవాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/