భద్రాచలం సీతారామస్వామి కల్యాణ మహోత్సవం సందర్బంగా రూ.కోటి మంజూరు చేసిన సీఎం కేసీఆర్

భద్రాచలం సీతారామస్వామి కల్యాణ మహోత్సవం సందర్బంగా తెలంగాణ సీఎం కేసీఆర్ రూ. కోటి రూపాయిలు మంజూరు చేసారు. భద్రాచలం సీతారామస్వామి కల్యాణ మహోత్సవం ఈ నెల 30న జరుగనున్న సందర్భంగా కల్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసింది. ప్రత్యేక నిధుల నుంచి సీఎం కేసీఆర్‌ నిధులు కేటాయించారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

సీతారాముల కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిధులను వెచ్చించారని తెలిపారు. క‌రోనా స‌మ‌యంలో భ‌ద్రాద్రి ఆల‌యానికి భ‌క్తుల రాక తగ్గిందని, దాంతో ఆదాయం లేకపోవడంతో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక నిధులు కేటాయించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ తరఫున సీఎం కేసీఆర్‌ మంత్రి ధన్యవాదాలు తెలిపారు.