సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన టీపీసీసీ చీఫ్ రేవంత్

స్టాఫ్ నర్సులు ఇయ్యాల రోడ్డున పడి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు

హైదరాబాద్ : సీఎం కెసిఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. స్టాఫ్ నర్సుల అంశాన్ని ప్రస్తావిస్తూ లేఖ రాశారు. తొలగించిన స్టాఫ్ నర్సులను విధుల్లో కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉన్నపళంగా ఉద్యోగాలు తొలగించి 1600 కుటుంబాలను రోడ్డున పడేశారన్నారు.కరోనా సమయంలో దేవుళ్లని పొగిడిన స్టాఫ్ నర్సులు ఇయ్యాల రోడ్డున పడి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

ప్రగతి భవన్.. ప్రజల కన్నీళ్లు తుడవాల్సిన ముఖ్యమంత్రి కార్యాలయమా లేక, కల్వకుంట్ల ప్రైవేటు లిమిటెడ్ కార్యాలయమా కేసీఆర్? 1600 మంది స్టాఫ్ నర్సులను విధుల్లో కొనసాగించాలని  డిమాండ్ చేశారు. 1.91 లక్షల ఖాళీలుంటే 50 వేలు మాత్రమే భర్తీ చేస్తామనడం ఏమిటని నిలదీశారు. ఖాళీల భర్తీకి తక్షణం షెడ్యూల్ ప్రకటించాలని రేవంత్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/