కృష్ణా జలాలపై నిజానికి ఎలాంటి వివాదం లేదు.. సజ్జల

తెలంగాణ రాజకీయ కోణంలో వివాదం సృష్టిస్తోందన్న సజ్జల

అమరావతి : వైస్సార్సీపీ నేడు కృష్ణా నదీ జలాలు-ఉభయ రాష్ట్రాల వినియోగం- ఏపీ హక్కులు అనే అంశంపై వర్చువల్ సదస్సు నిర్వహించింది. ఈ సమావేశంలో ఏపీ మంత్రులు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సదస్సులో వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పాలకులపై ధ్వజమెత్తారు. రాయలసీమకు నీళ్లిస్తామని గతంలో హామీ ఇచ్చిన కేసీఆరే ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్డుతగులుతున్నారని విమర్శించారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తోందని అన్నారు. కృష్ణా జలాలపై నిజానికి వివాదాస్పదమైనది ఏమీ లేకపోయినా, తెలంగాణ ప్రభుత్వం రాజకీయ కోణంలో వివాదం సృష్టిస్తోందని సజ్జల ఆరోపించారు. కృష్ణా నదీ జలాల కేటాయింపులు ప్రాజెక్టుల వారీగా జరిగాయని, కానీ తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరిని అన్ని వేదికలపైనా లేవనెత్తుతామని స్పష్టం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/