ఘనంగా టిపాడ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం

(టిపాడ్)డాలస్ తెలంగాణ ప్రజాసమితి , 2020 ఏడాదికి నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది. ఇక్కడి ఫిస్కో నగరంలోని శుభం బాసన్క్వెట్ హాల్‌లో అత్యంత ఆడంబరంగా జరిగింది.. డాలస్ ప్రాంతీయులు, స్థానిక, జాతీయ తెలుగు సంస్థల నాయకులు ఆసక్తిగా పాల్గొన్నారు. తొలుత డాలస్ చిరంజీవి శ్రేయస్ కొర్లపాటి ప్రార్థనా గీతం ఆలపించింది.. అనంతరం అమెరికా, భారత్ జాతీయ గీతాలను ఆలపించారు.. రఘువీర్ బండారు ఫౌండేషన్ కమిటీ, శారద సింగిరెడ్డి బోర్డు ఆఫ్ ట్రస్టీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు.. రఘువీర్ బండారు సభకు స్వాగతం పలికారు.. 2014లో సంస్థ స్థాపించినప్పటి నుంచి సాధించిన ఘనతను వివరించారు.. పనిచేస్తున్న నాయకత్వాన్ని, కార్యవర్గ సభ్యులను, పోషక దాతలను మనస్నూర్తిగా అభినందిస్తూ వారి సేవలను అంకితభావాన్ని కొనియాడారు..
కార్యక్రమంలో పూర్వ కమిటీ చైర్మన్ జానకి మందాడి 2020 నూతన కార్యవర్గంను అభినందించారు. ఈ ఏడాది ఫౌండేషన్ కమిటీ చైర్ రావు కలవలగారితో ప్రమాణస్వీకారం చేయించారు. అజ§్‌ురెడ్డి, రఘువీర్ బండారు, పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు.. నూతన చైర్ రావు కలవల మాట్లాడుతూ, ఈ ఏడాది చేసే కార్యక్రమాలను వివరించారు.. అత్యున్నత సేవలు అందించటంలో ముందు ఉంటామన్నారు..
పూర్వ బోర్డు ఆఫ్ ట్రస్టీ చైర్ పవన్ గంగాధర, పూర్వ అధ్యక్షుడు చంద్రారెడ్డి పోలీసు 2019 సంవత్సరంలో జరిగిన కార్యక్రమాలకు సహకరించిన కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.. ఈ ఏడాది బోర్డు ఈఫ్ ట్రస్టీ చైర్‌గా మాధవి సుంకిరెడ్డి, బోర్డు ఆఫ్ ట్రస్టీ వైస్‌చైర్‌గా ఇంద్రాణి పంచార్పుల, ఎగ్జిక్యూటివ్ కమిటీ కో ఆర్డినేటర్‌గా బుచ్చిరెడ్డి గోలి, ప్రెసిడెంట్‌గా, రవికాంత్‌రెడ్డి మామిడి, వైస్‌ప్రెసిడెంట్‌గా రూప కన్నెయ్యగారి, జనరల్ సెక్రటరీగా అనురూధ మేకల, జాయింట్ సెక్రటరీగా లింగారెడ్డి అల్వా, ట్రెజరర్‌గా శంకర్ పరిమళ్, జాయింట్ ట్రెజరర్‌గా సుంకిరెడ్డి మరియు రవికాంత్‌రెడ్డి మామిడి ఈఏడాది మరికొన్ని సేవా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తామని తెలిపారు.. పదవీ బాధ్యలు ఇచ్చిన నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/