ఆర్ఆర్ఆర్ ..బాహుబలి కలెక్షన్స్ క్రాస్ చేయడం కష్టమేనా..?

తెలుగు సినిమా సత్తాను యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన చిత్రం బహుబలి. ఈ సినిమా తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. రాజమౌళి స్థాయికూడా బిగా పెరిగింది. ప్రస్తుతం రాజమౌళి నుండి వస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్ , చరణ్ లతో పాటు బాలీవుడ్ , హాలీవుడ్ స్టార్స్ నటిస్తుండడం తో ఈ సినిమా ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే ఎన్ని అంచనాలు ఉన్న కానీ బాహుబలి రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టటడం కష్టమే అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఆర్ ఆర్ ఆర్ విడుదలైన ఐదు రోజుల వ్యవధిలో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ఫై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. ఆ తర్వాత ఆ రోజుల గ్యాప్ లోనే పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్ రిలీజ్ అవుతోంది. అంటే ఆర్ ఆర్ ఆర్ కి కంప్లీట్ గా థియేటర్లు దొరికేది కేవలం ఐదు రోజులు మాత్రమే. ఆ తర్వాత థియేటర్లను ఈ రెండు సినిమాలు పంచుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఆర్ ఆర్ ఆర్ కి థియేటర్లు మరింత తగ్గుతాయి. ఇక తమిళ్ లో అజిత్ నటిస్తోన్న వాలిమై కూడా రిలీజ్ అవుతుంది. కాబట్టి అజిత్ క్రేజ్ నడుమ ఆర్.ఆర్.ఆర్ తమిళనాడులో నిలదొక్కుకుంటుందా? అన్నది ఓ సందేహం. అలాగే ఓవర్సీస్ లోనే ఇదే పరిస్థితి. ఇక తాజాగా ఏపీ సర్కార్ సినిమా టికెట్స్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని సినిమాలకు ఒకే టిక్కెట్ రేటును ఫిక్స్ చేసింది. ఈ క్రమంలో ఆర్ ఆర్ ఆర్బాహుబలి రికార్డులను బ్రేక్ చేయగలదా? అంటే కష్టమేనని ట్రేడ్ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి.