టిప్పు సుల్తాన్ సింహాస‌నాన్ని వేలం వేసిన ఇంగ్లండ్‌

15 కోట్ల ధర నిర్ణయించిన బ్రిటన్‌

లండన్: 18వ శతాబ్దంలో మైసూరును పాలించిన టిప్పుసుల్తాన్‌ సింహాసనంలోని ముందరి భాగం ఇది. వజ్రాలతో పొదిగిన ఈ పులి తల ఆకృతిని రూ.15 కోట్లకు బ్రిటన్‌ వేలానికి పెట్టింది. అయితే, భారత్‌ నుంచి ఎత్తుకెళ్లిన అమూల్య సంపదను.. బ్రిటన్‌ ప్రభుత్వం ఇలా అంగట్లో తెగనమ్మడంపై భారత నెటిజన్లు మండిపడుతున్నారు.

కాగా, మైసూర్ టైగ‌ర్ టిప్పు సుల్తాన్ వాడిన సింహాస‌నం గురించి అప్ప‌ట్లో గొప్ప‌లు చెప్పుకునేవారు. ఆ సింహాస‌నాన్ని వ‌జ్రాలు, వైడూర్యాలు పొదిగించి బంగారం తొడుగుతో నిర్మించారు. దానికి ఎనిమిది పులుల‌ త‌ల‌లు ఉంటాయి. అయితే.. టిప్పు సుల్తాన్ ఓట‌మి త‌ర్వాత బ్రిటీష్ ఆర్మీ దాన్ని ముక్క‌లు చేసింది. సింహాస‌నాన్ని త‌స్క‌రించింది. ఆ సింహాస‌నంలో ఉన్న 8 బంగారు పులుల త‌లల్లో ఇది చివ‌రిది. దాన్ని ప్ర‌స్తుతం ఇంగ్లండ్‌.. వేలంలో పెట్టింది. దాని ధ‌ర‌ను 1.5 మిలియ‌న్ పౌండ్లుగా నిర్ణ‌యించింది. అంటే మ‌న క‌రెన్సీలో సుమారు రూ. 15 కోట్ల రూపాయ‌లు.


Throne Finial పేరుతో టిప్పు సింహాస‌నాన్ని ఇంగ్లండ్ వేలం వేయ‌గా.. దాన్ని వేలంలో వ‌చ్చే సంవ‌త్స‌రం జూన్ వ‌ర‌కు ఉంచ‌నున్నారు. దాన్ని ఎగుమ‌తి చేసుకునే వెసులుబాటు లేకుండా తాత్కాలికంగా దాన్ని బ్యాన్ చేస్తున్న‌ట్టు యూకే వెల్ల‌డించింది. ఆ సింహాస‌నం.. యూకే దాటి వెళ్లే ప్ర‌మాదం ఉంది.. అందుకే దానిపై తాత్కాలికంగా ఎగుమతిపై బ్యాన్ విధించాం. దాన్ని యూకేకు చెందిన వాళ్లే ద‌క్కించుకుంటార‌ని ఆశిస్తున్నాం.. అని యూకేకు చెందిన డిజిట‌ల్, క‌ల్చ‌ర్‌, మీడియా డిపార్ట్‌మెంట్ ట్వీట్ చేసింది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/