అమెరికా ఎన్నికల్లో తెలుగు మహిళ

వర్జీనియా నుంచి పోటీ చేస్తున్న మంగా అనంతత్మూలా

Manga Anantatmula
Manga Anantatmula

వర్జీనియా: ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడి పీటంపై కూర్చునేందుకు వ్యూహాలను రచిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న ట్రంప్… అందులో గట్టెక్కారు. ఇక పూర్తిగా రానున్న ఎన్నికలపైనే ట్రంప్ దృష్టి సారించారు. అమెరికా కాంగ్రెస్ ఎన్నికల్లో వర్జీనియా రాష్ట్రం నుంచి రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా మంగా అనంతత్మూలా అనే మహిళ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆమె ప్రచారం ప్రారంభించారు. జనవరి 26వ తేదీన మంగా అనంతత్మూలా రిపబ్లికన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. వర్జీనియా నుంచి రిపబ్లికన్ తరపున పోటీచేస్తున్న తొలి ఇండో అమెరికన్‌గా మంగా గుర్తింపుపొందారు. వర్జీనియా డెమొక్రాట్ల కంచుకోటా ఉంటోంది. వర్జీనియాలో 17శాతం ఆసియా దేశాలకు చెందిన జనాభా ఉండగా అందులో 7శాతం మంది భారత్‌కు చెందిన వారు ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె డిఫెన్స్ అక్విజిషన్ ప్రోగ్రాంలో ఉద్యోగిగా పనిచేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/