డబల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో ఎలాంటి పైరవీలు ఉండవు: మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ శుక్రవారం నగరంలోని బన్సిలాల్ పేట్‌లో డబల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇళ్ల విషయంలో ఎలాంటి పైరవీలు ఉండవని, లాటరీ పద్దతిలో బస్తీవాసులకు ఇళ్ల కేటాయింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిరుపేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని సీఎం సంకల్పించారన్నారు. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని పెద్దలు అంటారని… అలాంటి ఇల్లు కట్టించి, పిల్లల పెళ్లికి కళ్యాణలక్ష్మి ఇచ్చి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని అన్నారు.

నగరంలో 40 లక్షలు విలువ చేసే ఇళ్లు అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ వచ్చిన తరువాత పెన్షన్ 10 రెట్లు పెంచామని, 18 వేల కోట్లలో 11 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇళ్లు కట్టామన్నారు. మిగతావి కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. నగరంలోని పేదల అందరికీ ఇళ్లు ఇచ్చేలా చూస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/