పండుగల్లో నరకం చూపెడుతున్న టోల్‌గేట్లు

ఒక్కమాట (ప్రతి శనివారం)

Toll Plaza

గత నాలుగు రోజులుగా పండుగలకు వెళ్లివస్తున్న వాహనాలు గంటల తరబడి కొన్ని టోల్‌గేట్ల వద్ద నిలబడిపోవాల్సివస్తున్నది. అవసరం మేరకు ఏర్పాట్లు చేయలేకపోవడంతో సొంత ఊర్లకు వెళ్లేందుకు పిల్లాపాపలతో బయల్దేరిన వేలాది కుటుంబాలు రోడ్లపైనే పడిగాపులుకాయాల్సివచ్చింది. ముఖ్యంగా బస్సుల్లో వెళ్లే సాధారణ ప్రయాణికుల పరిస్థితి వర్ణనాతీతం. కొన్ని గేట్లవద్ద నాలుగైదు గంటల వరకు కూడా వేచి చూడాల్సి వచ్చిందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ ప్రాంతంలో మంచినీరు ఉండదు. తినుబండరాలు ఉండవ్ఞ. పిల్లాపాపలతో సొంత ఊర్లకు ఎప్పుడెప్పుడు చేరుతామా అని ఆత్రుతతో,ఆశతో ఉన్న కుటుంబాలు పడిన కష్టం వర్ణనాతీతం. మరీ ముఖ్యంగా రాత్రివేళ్లలో అయితే ఇబ్బందికరంగా మారింది. సాయం చేసే మనుషులు ఉండరు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఎటు వెళ్లాల్లో తెలియదు. చీకట్లో పురుగుపుట్ర ఉంటుందనే భయం. ఏ సంస్కరణలు చేపట్టినా, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలవైపు అడుగువేసినా అవి ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి. ఇబ్బందులు కలిగించేవిగా ఉండకూడదు.
హైటెక్‌ నినాదంతో రాకెట్‌ వేగంతో అభివృద్ధిపదంవైపు దూసుకువెళ్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు టోల్‌గేట్లతో వేగానికి అడుగడుగునా అడ్డుపడుతూ ప్రజలను ఇక్కట్లకు గురి చేస్తున్నారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధిని సాధించి గంటకు రెండువందల కిలోమీటర్లకుపైగా వేగంతోపోయే అత్యాధునిక వాహనాలను తయారు చేశారు. రోడ్లు అభివృద్ధికి సోపానాలని చెప్తూ దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్రస్థాయి రహదా రులను పెద్దఎత్తున నిర్మించారు. ప్రయాణ కాలాన్ని గణనీయంగా తగ్గించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.గత రెండు దశాబ్దా లుగా పరిశీలిస్తే ఇప్పుడు ప్రయాణకాలం చాలా తగ్గిపోయింది. వేగం పెరిగింది. కానీ వీటన్నింటికి ఈ టోల్‌గేట్లు మోకాలడ్డుతు న్నాయేమోననిపిస్తున్నది. ఫాస్టాగ్‌ విధానాన్ని అమలులోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నా అవి ఇంకా పూర్తిగా వాహనదారులకు అవగాహన కల్పించలేకపోతున్నాయి. అయినా కొన్ని ప్రాంతాల్లో కంప్యూటర్లు మోరాయించడంతో ఇబ్బందులు ఎదురవ్ఞతున్నాయి. పండుగలు వచ్చాయంటే ఈ టోల్‌గేట్ల వద్ద వాహనదారులకు నరకం చూపిస్తున్నారు. కంప్యూటర్‌ విజ్ఞానంతో అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించిన వాహనాల వేగం అంతకంతకు పెంచుకుంటూ మరొకపక్క వేగానికి గంటల తరబడి బ్రేక్‌ వేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాల్సిన తరుణమిది. తెలుగురాష్ట్రాల్లో గత నాలుగురోజులుగా పండుగలకు వెళ్లివస్తున్న వాహనాలు గంటల తరబడి కొన్ని టోల్‌గేట్ల వద్ద నిలబడిపోవా ల్సివస్తున్నది. అవసరం మేరకు ఏర్పాట్లు చేయలేకపోవడంతో సొంత ఊర్లకు వెళ్లేందుకు పిల్లాపాపలతో బయల్దేరిన వేలాది కుటుంబాలు రోడ్లపైనే పడిగాపులుకాయాల్సివచ్చింది. ముఖ్యంగా బస్సుల్లో వెళ్లే సాధారణ ప్రయాణికుల పరిస్థితి వర్ణనాతీతం. కొన్ని గేట్లవద్ద నాలుగైదు గంటల వరకుకూడా వేచిచూడాల్సి వచ్చిందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ ప్రాంతంలో మంచినీరు ఉండదు. తినుబండరాలు ఉండవ్ఞ. పిల్లాపాపలతో సొంత ఊర్లకు ఎప్పుడెప్పుడు చేరుతామా అని ఆత్రుతతో,ఆశతో ఉన్న కుటుంబాలు పడిన కష్టం వర్ణనాతీతం. మరీ ముఖ్యంగా రాత్రివేళ్లలో అయితే ఇబ్బందికరంగా మారింది. సాయం చేసే మనుషులు ఉండరు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఎటువెళ్లాల్లో తెలియదు.చీకట్లో పురుగుపుట్ర ఉంటుందనేభయం. ఏ సంస్కరణ లు చేపట్టినా, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలవైపు అడుగువేసినా అవి ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి. ఇబ్బందులు కలిగించే విగా ఉండకూడదు. అసలు టోల్‌టాక్స్‌ విధానాన్నే రద్దుచేయాలని తెలుగురాష్ట్రాల్లోనేకాదు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో చాలా కాలంగా డిమాండ్‌ ఉంది.ఇందువల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించే లారీల పరిస్థితి మరింతదారుణంగా ఉందని లారీడ్రైవర్లు ఒకప్పు డు సమ్మెకు కూడా దిగారు.రద్దు చేసే మాట అటుంచి మరికొన్ని వంతెనలు నిర్మించి దేశంలో శాశ్వతంగా ఈ టోల్‌ ఉండేవిధంగా చర్యలు చేపడుతున్నారు.

రోడ్డు మధ్యలో ఏకంగా గదులను నిర్మించి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు వెళ్లే వాహనాలు తప్ప సామాన్యులు ప్రయాణించే ఆర్టీసీ బస్సులను కూడా వదిలి పెట్టడం లేదు. వసూళ్ల సమయంలో టోల్‌గేట్‌ సిబ్బంది కొన్ని సందర్భాల్లో వ్యవహరించిన తీరు పలువ్ఞరిని తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నది. కొన్నిచోట్ల ఘర్షణలు కూడా చోటు చేసుకొని పోలీసు స్టేషన్‌ దాకా వెళ్లిన సందర్భాలున్నాయి. కొన్ని రోడ్లపై నిర్మించిన వంతెనలకు ఈ వ్యయం చేసిన నిధులు ఈ టోల్‌టాక్స్‌లతో ఎన్ని ఏళ్లకు తీరుతాయో చెప్పలేని పరిస్థితి. వీలైనంత వరకు పెట్టుబడి పూర్తిగా వసూలుకాకుండా రింగ్‌లుగాఏర్పడి ఏదోరకంగా ఈ టోల్‌ టాక్స్‌ను కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సర్వ విధాలా లాభదాయకంగా ఉండే ఈ విధానాన్ని కొనసాగించేందుకు అధికారులు కూడా తమవంతు సహకారాన్నిఅందిస్తున్నారు. గతంలో నిర్ణీత గడువ్ఞలో పెట్టుబడి తిరిగి వచ్చిన సందర్భాల్లో కూడా ఈ వసూళ్లను కొనసాగించారు. చివరకు పత్రికల్లో వచ్చి కొందరు కోర్టులకు వెళ్లితే తప్పదీనిని నిలుపలేకపోయారు. తెలం గాణలో కరీంనగర్‌జిల్లాలో మానేరు నదిపై నిర్మించిన వంతెనకు వెచ్చించిన డబ్బు వచ్చినా ఈ బలవంతపు వసూళ్లు ఆగలేదు.

ఈ విషయం కొందరు ప్రజాప్రతినిధులు పాలకుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయస్థానాన్ని ఆశ్రించిన తర్వాతకానీ దీనికి ఫూల్‌స్టాప్‌ పెట్టారు. టోల్‌టాక్స్‌ ద్వారా ప్రభుత్వానికి వస్తున్నఆదాయం కంటే రెట్టింపు స్థాయిలో అవినీతి అధికారులకు, దళారులకు చేరుకుంటుందనే విమర్శలు కూడా ఉన్నాయి. రోడ్డు భవనాల శాఖలో రోజురోజుకు అవినీతి పెరిగిపోతున్నది. మరమ్మతుల పేరుతో కోట్లాది రూపా యలు వెచ్చిస్తున్నారు. వానలువచ్చినా,కరవ్ఞలు వచ్చినా, దళారు లకు కల్పతరువ్ఞగా మారిపోతున్నాయి. వానకు రోడ్లకు ఎంతటి దగ్గరి చుట్టరికం ఉందో ఉభయరాష్ట్రాల్లోనూ కొన్ని రోడ్లను చూస్తే అర్థమవ్ఞతుంది. ప్రపంచంలో మరే ఇంజినీర్లు కూడా నాలుగు చినుకులకు పాడైపోయే రోడ్లను నిర్మించలేరేమోననిపిస్తున్నది.

తెలుగురాష్ట్రాల్లో కొన్ని రోడ్లను చూస్తే మన ఇంజినీర్లు ఎంతటి మేధావ్ఞలో చెప్పకనే చెబుతున్నాయి. సాక్షాత్తు హైదరాబాద్‌ నగరంలో కొన్ని రోడ్ల పరిస్థితి పరిశీలిస్తే ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. మరమ్మతు చేసిన కొన్ని రోజులు తిరగకుండానే రోడ్లు యధాతథంగా గుంటలతో దర్శనం ఇస్తే అవినీతి గురించి బయటకు వస్తుందేమో, ప్రజలు ఫిర్యాదు చేస్తారేమోననే కొంత మేరకు అయినా భయభక్తులుండేవి. కానీ ఆ పరిస్థితులు ఇప్పుడు లేవ్ఞ. తెలిస్తే ఏముందిలే. వారికి తెలియందా? అనే పరిస్థితికి దిగిపోయారు. ఇలా కోట్లాది రూపాయలు దుర్వినియోగం అవ్ఞతున్నా దాన్ని నియంత్రించలేక టోల్‌టాక్స్‌ పేరుతో ప్రజల వద్ద డబ్బు వసూలు చేయడం ఎంతవరకు సమంజసమో ఆలో చించాలి. అంతెందుకు కొందరు రాజకీయ నాయకులకు రాష్ట్ర రహదారులు, జాతీయ రోడ్ల విభాగంలోని మరికొందరు అధికా రులకు అందుతున్న పర్సెంటేజీలో కొంత త్యాగం చేసినా ఈ నిధులు సమకూర్చుకోవడం పెద్ద సమస్యకాకపోవచ్చునేమో. వాస్త వంగా టోల్‌టాక్స్‌ ఇప్పటికిప్పుడు పుట్టింది కాకపోయినావాహనాల పన్నులు లేని కాలంలో రోడ్ల నిర్వహణ కోసం ఆ రహదారుల్లో ప్రయాణించే వారి నుంచి టోల్‌టాక్స్‌ వసూలు చేసే ప్రతిపాద నను 1851 సంవత్సరంలోనే ఆనాటి బ్రిటిష్‌ పాలకులు చట్టం తీసుకువచ్చారు.

అలా ప్రారంభమైన టోల్‌టాక్స్‌పై అప్పట్లోనే అభ్యంతరాలు వచ్చాయి. రానురాను ఈ విధానంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోవడంతో టోల్‌టాక్స్‌పై సమగ్ర అధ్యయనం చేసేందుకు ఇండియన్‌ రోడ్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీని నియ మించారు. దేశంలో పలు చోట్ల పర్యటించి అనేక మంది ప్రయా ణికులను, వాహనదారులను సంప్రదించిన పిదప ఆ కమిటీ ఈ విధానాన్ని వ్యతిరేకించింది. వాహనాలను నిలిపి టోల్‌ వసూలు చేయడం వల్ల ఇంధనం వృధా కావడంతోపాటు ప్రయాణకాలం పెరిగి వాహనదారులు ఇబ్బందులకు గురవ్ఞతున్నారని ఆ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఇలా ప్రతిచోటా వాహనాలను ఆపి వసూలు చేసేకంటే వాహనాలపై పన్నులు విధించాలని ఆ కమిటీ సూచనల మేరకే దేశంలోని ఇతర రాష్ట్రాలతోపాటుఅప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 1931 సంవత్సరంలో మద్రాస్‌ మోటార్‌ పన్నుల చట్టానికి రూపకల్పన చేశారు.

అయితే ఎక్కడైనా ప్రత్యేకంగా ప్రైవేట్‌గానైనా ప్రభుత్వం అప్పుతెచ్చి రోడ్లు,వంతెనలు నిర్మిస్తే కొంతమేరకు డబ్బు వసూలు చేసుకునేవిధంగా 1951లోని టోల్‌టాక్స్‌చట్టాన్ని అలానే ఉంచారు.ఇప్పుడు ఆ చట్టాన్నిఉపయో గించుకొని రహదారులపై నిర్మించిన వంతెనకు నిర్మాణ వ్యయం వచ్చేవరకు వసూలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 1975 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం మొట్టమొదటి సారిగా టోల్‌టాక్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. 1983లో తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఆనాటిముఖ్యమంత్రి ఎన్టీ రామారావ్ఞ రద్దుచేశారు.

మళ్లీ 1993లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పునరుద్ధరించింది. ఏదిఏమైనా టోల్‌టాక్స్‌ కొందరు రాజకీయ నాయకులకు, వ్యాపారులకు కల్పతరువ్ఞగా మారిపోయింది. కొన్నిప్రాంతాల్లో వారి పేర్ల మీదనే ఆ వంతెన లను పిలుస్తాన్నారంటే ఏస్థాయికి ఎదిగిపోయిందో చెప్పొచ్చు. పాలకులు ఏ పరిశోధనా విభాగంతోనైనా దర్యాప్తు చేయిస్తే ఇక్కడ జరుగుతున్న అవకతవకలు, లోపాయి కారిగా ఉన్న ఏర్పాట్లు తదితర ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. గంటల తరబడి టోల్‌గేట్ల వద్ద వాహనాలు నిలబడిపోవడం ముఖ్యంగా పండుగలప్పుడు మరింత దారుణంగా తయారవ్ఞతున్నది.ఈ సమస్యలను పరిష్కరించేందుకు సరైన నిర్ణయం తీసుకుంటే పాలకులకు గౌరవప్రతిష్టలు మరింత ఇనుమడిస్తాయి.

  • దామెర్ల సాయిబాబ