నెల్లూరులో రోడ్డు ప్రమాదం..22 మందికి గాయాలు

నెల్లూరు: నెల్లూరు జిల్లా మనుబోలులో హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ముందు వెళ్తున్న లారీని వెనక నుంచీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులోని 50 మందిలో… 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 18 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అది చూసిన స్థానికులు వేగంగా స్పందించారు. బస్సులో ప్రయాణికులందర్నీ బయటకు దించి… గాయపడిన వారిని మనుబోలు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు. కొంతమందిని ఇతర ఆస్పత్రులకు మెరుగైన ట్రీట్మెంట్ కోసం తరలిస్తున్నారు. ప్రమాదంలో… తీవ్రంగా గాయపడిన ఓ కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉంది. బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన బస్సు… బెంగళూరు నుంచీ వస్తున్నట్లు తెలిసింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/