టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు..సీఎం, సీఎం అంటూ నినాదాలు

Today, with the arrival of Chandrababu, there is an uproar in the TDP office

అమరావతిః టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మే 13న పోలింగ్ జరిగిన తర్వాత తొలిసారిగా ఈరోజు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. చంద్రబాబుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.

అధినేత రాకతో టీడీపీ ప్రధాన కార్యాలయంలో సందడి నెలకొంది. సీఎం, సీఎం అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో టీడీపీ ఆఫీసు ప్రాంగణం అంతా కోలాహలం నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో, పార్టీ కార్యాలయంలో ఉండి పనిచేసిన నేతలను చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు.