ఇవాళ కొత్త ప్రయాణం మొదలుపెట్టాను..ఈటల

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతానని ప్రకటన

హైదరాబాద్: మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన అనంతరం ఈటల మాట్లాడుతూ..ఇవాళ తాను కొత్త ప్రయాణం మొదలుపెట్టానని చెప్పారు. తమ పరివారంలో తనకు కూడా స్థానం కల్పిస్తూ, పార్టీలో చేరికకు స్వాగతించిన బీజేపీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని ఉద్ఘాటించారు. ఇప్పుడు, ఎల్లప్పుడూ ప్రజలు, పార్టీ కోసమే శ్రమిస్తానని పేర్కొన్నారు.

కాగా, నేడు ఈటల రాజేందర్ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నవిషయం తెలిసిందే.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/