ఇంటి శుభ్రతకు..

Home Clean

ఇంట్లోకి మన పర్మిషన్‌ లేకుండా వచ్చి, మన సమయాన్ని వృధా చేసేది దుమ్ము. మనం ఇంటిని కోవెలగా భావిస్తాం. మనకు పర్సనల్‌ స్పేస్‌ కాబట్టి దానిని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. ఆఫీస్‌ పని ఒత్తిళ్ల నుంచి ఇంటికి వచ్చి సేద దీరడానికి అనువైన ప్రదేశం మన ఇల్లే. మనకు మనం సేఫ్‌గా అలాగే హ్యాపీగా భావించే ప్లేస్‌ ఇది. ఇంటిని శుభ్రపరచడమనేది మహిళలకు వెన్నతో పెట్టిన విద్య. దుమ్ము అనేది పోలెన్‌, డర్ట్‌, హ్యూమన్‌ హెయిర్‌, ఫాబ్రిక్స్‌కి చెందిన ఫైబర్‌, వుడ్‌ యాష్‌, కెమికల్స్‌ అలాగే హ్యూమన్‌ డెడ్‌ స్కిన్‌ సెల్స్‌తో తయారవుతుంది.

ఈ చిన్న చిన్న పదార్థాలు ఎక్కువగా పేరుకుపోయి ఎక్కడ పడితే అక్కడ మనకు దర్శనమిస్తాయి. వీటిని సరైన సమయంలో క్లీన్‌ చేయకపోతే దుమ్ము బాగా పేరుకుపోయి పరిసరాలు అస్తవ్యస్తంగా తయారవుతాయి. ఈ దుమ్ము వలన అప్పటికప్పుడు తీవ్రమైన హాని కలగకపోయినా ఇంట్లోవారికి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ప్రతిరోజు వాక్యూమ్‌ చేసినా కూడా కార్పెట్లలోకి డస్ట్‌ దూరిపోతుంది. అందుకని వాటిని పూర్తిగా క్లీన్‌ చేయాలంటే డిటర్జెంట్‌ వాటర్‌తో శుభ్రపరచాలి. కార్పెట్‌లను తొలగించడం ద్వారా డస్ట్‌ని ఎక్కువ శాతం తగ్గించవచ్చు.

రోడ్‌ఫేసింగ్‌ ఇల్లయితే కిటికీలను మూసి ఉంచడం మంచిది. బయటి నుంచి వచ్చే దుమ్ము హానికరమైనది. అందుకే కిటికీలను తెల్లవారుజామున లేదా రాత్రిపూట తెరవడం ద్వారా తాజా గాలిని స్వాగతించవచ్చు. ఎయిర్డ్‌ కండిషనర్‌ ఫిల్టర్స్‌ని తరచూ క్లీన్‌ చేయడం వల్ల ఇంట్లో గాలి నాణ్యతను మెరుగుపరుచువకోచ్చు. పిల్లోస్‌, కర్టెన్స్‌ అలాగే కార్పెట్స్‌తో పాటు మిగతా ఐటమ్స్‌ పై పేరుకుపోయిన దుమ్మును దులిపి ఆ తరువాత చీపురుతో ఇల్లంతా శుభ్రంగా ఊడవాలి.
ఆ తరువాత ఫినాయిల్‌ కలిపిన నీళ్లతో ఇల్లంతా తుడవాలి. దాంతో దుమ్ము తొలగిపోయి ఇల్లు అద్దంలా మెరుస్తుంది. ఇంట్లో అటకల మీద అనవసరమైన స్టఫ్‌ని తొలగించుకోవాలి. ఫుట్‌వేర్‌ ద్వారా దుమ్ము ధూళి ఎక్కువగా ఇంట్లోకి వస్తుంది. కాబట్టి ఫుట్‌వేర్‌ని ఇంటిబయటే ఉంచే ఏర్పాటు చేయాలి. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొంతైన శ్రమ తగ్గుతుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/