కాలులేకున్నా తగ్గని ఆత్మస్థైర్యం

MANASI JOSHI

భారత పారా బాడ్మింటన్‌ అథ్లెట్‌ మానసి గిరీశ్చంద్ర జోషి ప్రస్తుతం వరల్డ్‌ నెంబర్‌ 2లో ఉంది. జోషి తన ఆరేళ్ల వయసు నుండే తన తండ్రితో బ్యాడ్మింటన్‌ ఆడటం మొదలు పెట్టింది. ఆయన బాబా ఆటోమిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ రిటైర్డ్‌ సైంటిస్ట్‌. జోషి ముంబయిలో ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.

2011లో జరిగిన ఒక రోడ్‌ యాక్సిడెంట్‌లో జరిగిన ప్రమాదంలో ఆమె ఒక కాలు కోల్పోయింది. అయినప్పటికీ 2018లో పుల్లెలగోపీచంద్‌ బాడ్మింటన్‌ అకాడమీలో శిక్షణ పొందారు. ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన ఆసియన్‌ పారా గేమ్స్‌లో బ్రాంజ్‌ మెడల్‌ గెలుచుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో జరిగిన పారా బ్యాడ్మింటన్‌లో వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ గోల్డెమెడల్‌ సాధించారు. ఆరేళ్ల వయసులోనే బ్యాడ్మింటన్‌ ఆడటం మొదలుపెట్టిన మానసి జిల్లాస్థాయిలో కూడా మ్యాచ్‌లు ఆడారు. రోడ్డుప్రమాదంలో ఆమె తన ఎడమ కాలు కోల్పోయారు. అయినప్పటికీ బ్యాడ్మింటన్‌లో శిక్షణ పొంది ఒక కాలుతోనే బ్యాడ్మింటన్‌ ఆడవచ్చని మానసి జోషి నిరూపించారు. 2014లో జాతీయ స్థాయి టోర్నమెంట్‌ స్థాయిలో అర్జున అవార్డు గ్రహీత పారుల్‌ పర్మార్‌పై మానసి గెలుపు సాధించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/