ప్ర‌జ‌ల‌కు వైద్యం ఒక హ‌క్కుగా ప్ర‌భుత్వం క‌ల్పించాలి

మౌన‌దీక్ష‌ అనంతరం మీడియాతో కోదండ‌రాం

TJS President Kodandaram with the media
TJS President Kodandaram

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత క‌రోనా సంక్షోభ ప‌రిస్థితుల స‌మ‌యంలో ప్ర‌భుత్వం తీరును నిర‌సిస్తూ టీజేఎస్ అధ్యక్షుడు కోదండ‌రాం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉద‌యం 8 గంట‌ల నుంచి 9 గంట‌ల వ‌ర‌కు మౌన‌దీక్ష‌ చేపట్టారు. దీక్ష విరమణ అనంతరం ఆయన మాట్లాడారు కొవిడ్ నియంత్రణకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని , ప్ర‌జ‌ల‌కు వైద్యం ఒక హ‌క్కుగా ప్ర‌భుత్వం క‌ల్పించాల‌ని అన్నారు. త్వ‌ర‌గా అంద‌రికీ వ్యాక్సిన్లు వేయాల‌ని , . కరోనాతో మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/