‘జగన్ వంటి నాయకులు యుగానికి ఒక్కరే వ‌స్తారేమో అనేలా పాలన’

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్య

Sajjala Rama Krishna Reddy
Sajjala Rama Krishna Reddy

Amaravati: ఏపీలో వైకాపా ప్రభుత్వం రెండేళ్ల పాలనలోనే ఎన్నడూ చూడని అభివృద్ధి జరిగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘సజ్జల ‘ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ నేరవేరుస్తున్నారని , అధికారం చేపట్టిన తర్వాత ప్రతిక్షణం విలువైనదేనని భావిస్తూ సీఎం జగన్ అభివృద్ధి కోసం నిరంతరం క‌ష్ట‌ప‌డుతున్నార‌ని అన్నారు. . ఎన్నో హామీలను జగన్‌ నెరవేర్చారని అన్నారు. సీఎం జ‌గ‌న్ ప్రారంభించిన గ్రామ సచివాలయ వ్యవస్థను ఇప్పుడు దేశమంతా చూస్తోందని చెప్పారు. సీఎం జగన్ వంటి నాయకులు యుగానికి ఒక్కరే వ‌స్తారేమో అనేలా పాలన కొనసాగుతుంద‌ని సజ్జల వ్యాఖ్యానించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/