గంగవ్వను దగ్గరికి తీసుకొని కేటీఆర్ సరదా వ్యాఖ్యలు

గంగవ్వ..తెలుగు ప్రజలకు సుపరిచితురాలు. షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అయినా ఈమె..ఆ తర్వాత సినిమా ఛాన్సులు తలుపుతట్టడం , ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ కు వెళ్లడం ఇలా అన్ని కూడా చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం సినిమాలతో పాటు షార్ట్ ఫిలిమ్స్ తో బిజీ గా ఉన్న గంగవ్వ తో మంత్రి కేటీఆర్ సరదాగా సంభాషణలు చేసారు.

కరీంనగర్ లో జరిగిన కరీంనగర్ కళోత్సవాల ముగింపు వేడుకలకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ ఫేం గంగవ్వ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. వేదికపై గంగవ్వను ప్రత్యేకంగా దగ్గరకు తీసుకుని ఆయన సరదా వ్యాఖ్యలు చేశారు. తాను మహేశ్ బాబులా ఉన్నానని గంగవ్వ చెప్పిందని… ఈ మాట ఆయన వింటే ఫీల్ అవుతారని చమత్కరించారు. గంగవ్వా ఎందుకైనా మంచిది ఒకసారి కళ్లు టెస్ట్ చేయించుకో అని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్నఅందరూ నమ్ముల్లో మునిగిపోయారు. ఆ తర్వాత ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ… గ్రామీణ ప్రాంతానికి చెందిన గంగవ్వ తన ప్రతిభా పాటవాలతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారని ప్రశంసించారు.