నేడు తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల

Tirumala Temple
Tirumala Temple

​ తిరుమలః ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ నేడు విడుదల చేయనుంది. ఏప్రిల్ నెలలో దర్శనాల కోసం నేడు టికెట్లు జారీ చేయనున్నారు. ఈ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో ఏప్రిల్ నెల కోటా టికెట్లు విడుదల చేస్తున్నామని టీటీడీ వెల్లడించింది. నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఏప్రిల్ నెల వసతి గదుల కోటా విడుదల చేయనున్నామని తెలిపింది. శ్రీవారి భక్తులు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవడానికి తమ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in ను సందర్శించాలని టీటీడీ సూచించింది.