ఆ మూడు యూట్యూబ్ చానెల్స్ ఫై కేసు పెట్టిన సమంత

Samantha-Looking-In-Black-Saree
Samantha-Looking-In-Black-Saree

సినీ నటి , మాజీ అక్కినేని నాగ చైతన్య భార్య సమంత..తాజాగా మూడు యూట్యూబ్ చానెల్స్ కు షాక్ ఇచ్చింది. చైతు తో విడాకుల ప్రకటన చేసిన తర్వాత ఎవరికీ వారు సోషల్ మీడియా లో కథనాలు రాసారు. సమంత..చైతు తో విడిపోవడానికి కారణాలు ఇవే అంటూ ప్రచారం చేసారు. వాటిలో ఏమాత్రం నిజం లేనప్పటికి..ప్రజల్లో మాత్రం అవే నిజాలు అన్నట్లు ప్రచారం చేసి సొమ్ము చేసుకున్నారు.

ఈ క్రమంలో తనపై తప్పుడు కథనాలు ప్రచారం చేసిన మూడు యూ ట్యూబ్ ఛానల్స్ పై సమంతా పరువు నష్టం దావా వేశారు. సుమన్ టివి, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీ తో పాటు వెంకట్రావు అనే అడ్వకేట్‌‌పై పిల్ దాఖలు చేశారు. మరికాసేపట్లో సమంత తరుపున హైకోర్టు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించనున్నారు. మరి న్యాయవాది వాదనల తర్వాత కోర్ట్ ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.

ప్రస్తుతం సమంత చైతు తో విడాకులు తీసుకొని సినిమాల ఫై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు డైరెక్టర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.