జనవరిలో సెట్స్ పైకి మహేష్ కొత్త మూవీ

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం జనవరి నుండి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. కొద్దీ రోజుల క్రితం ఈ మూవీ సెట్స్ ఫైకి వెళ్లగా..ఆ తర్వాత మహేష్ ఫ్యామిలీ లో వరుస విషాదాలు చోటుచేసుకోవడం , హీరోయిన్ పూజా హగ్దే కాలికి గాయం కావడం తో షూటింగ్ కు బ్రేక్ పడింది.

ప్రస్తుతం అంత సెట్ కావడం తో జనవరి నుండి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ తెలిపింది. గతంలో మహేష్ – త్రివిక్రమ్ కలయికలో అతడు , ఖలేజా మూవీస్ వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు మూడో సారి వీరిద్దరి కాంబో లో మూవీ వస్తుండడం తో సినిమా ఫై అంచనాలు తారాస్థాయి కి చేరాయి.