ఏపి ప్రభుత్వంపై దేవినేని విమర్శలు

ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి? .. దేవినేని

devineni uma
devineni uma

అమరావతి: నిమ్మగడ్డ రమేశ్‌ విషయంపై టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావు స్పందిస్తూ .. ఏపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘కోర్టు తీర్పులను ఎందుకు అమలుచేయటం లేదు? ఏపి ప్రభుత్వానికి ఏమైంది? గవర్నర్ జోక్యం చేసుకోవాలా.. ఇదేం తీరు? కేసుపై మాకు అవగాహన ఉంది? ఏపిలో అసలేం జరుగుతోంది? ఎవరు చెప్పినా వినం మా పాలన మా ఇష్టమంటున్న తాడేపల్లి రాజప్రసాదానికి ఈ మాటలు వినబడుతున్నాయా? ముఖ్యమంత్రి జగన్ గారు’ అని దేవినేని ఉమ విమర్శించారు.

కాగా, ఏపి‌లో కొవిడ్‌19 వైరస్‌ విజృంభణ రికార్డు స్థాయిలో పెరిగిపోతుండడం పట్ల దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. ‘జోరు తగ్గని కరోనా.. 8,147కేసులు, 49 మరణాలు నమోదు. ఊపిరి పోస్తారని వస్తే ఉసురే పోయింది. లక్షణం ఉంటే వైద్యం అందదంతే. కాళ్లా వేళ్లా పడినా వైద్యం అందని దుస్థితి ప్రభుత్వానికి కనబడుతుందా? జగన్‌ గారు ఆరు నెలలకు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కాదు ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి’ అని ప్రశ్నించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/