షరపోవా: టెన్నిస్‌లో కెరటం

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ముందు డ్రగ్‌ టెస్ట్‌ చేసినప్పుడు ఆమె ఒంట్లో ‘మెల్డోనియం అనే మందు బయట పడింది. అదేమీ నిషేధించిన ఔషధం కాదు. అప్పటికి పదేళ్లుగా ఆమె తన ఆరోగ్యం కోసం తనకు తెలియకుండానే మెల్డోనియం కలిసి ఉన్న మెడిసిన్‌ని వాడుతున్నారు. డోపింగ్‌ ఏజెన్సీకొత్తగా విడుదల చేసిన నిషేధిత ఔషధాలలో దానిని కూడా చేర్చడంతో షరపోవా దోషికావలసి వచ్చింది.

Sharapova

ఆమె ఒకప్పుడు టెన్నిస్‌లో ఓ ఉప్పెన. కోర్టులో ఆమె ఉందంటే చాలు స్టేడియంలో ఉండే ప్రేక్షకులు, టివీ వీక్షకులు ఇట్టే ఆకర్షితులైపోతారు. ఆమె ఆట తీరుకు మాత్రమే కాదు ఆమె అందానికి ఫిదా అయిపోతారు.

అలాగని ఆమె ఆటను తేలిగ్గా తీసుకోలేదు. 18 సంవత్సరాల వయసులోనే టెన్నిస్‌లో వరల్డ్‌నెంబర్‌ వన్‌ స్థానానికి చేరుకున్నారు అంటే టెన్నిస్‌పట్ల ఆమెకున్న అంకితభావానికి నిదర్శనం. వింబుల్డన్స్‌ బరిలో దిగిందంటే చాలు గెలుపు ఖ్యాయం అనేలా ఆడతారు. ఎంత ఎత్తుగా ఎదిగారో అంతే పాతాళానికి దిగిపోయే పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ ఆమె కృంగిపోలేదు. ఆటలో దాదాపు పదిహేను నెలల నిషేధాన్ని ఎదుర్కొన్నారు. ప్రపంచమంతా అయ్యో! అని నిర్ఘాంతపో యింది. నిషేధం తర్వాత మళ్లీ కోర్టులోకి ప్రవేశించి, రెండేళ్లు ఆడారు. ఇటీవల ఆమె టెన్నిస్‌ క్రీడకు తన రిటైర్‌మెంట్‌ను ప్రకటించి, అభిమానులకు నిరాశను మిగిల్చారు.

ఆమె ఎవరో ఇప్పటికే మీరు ఊహించుకుని ఉంటారు. ఆమె షరపోవా. పరిచయం అక్కర్లేని టెన్నిస్‌ క్రీడాకారిణి. నిషేధం తర్వాత రెండేళ్లు ఆడారు. అంతలోనే షరపోవా రిటైర్‌మెంట్‌ని ప్రకటించారు. ఆమెను ఎవరూ ఆపలేదు. ఆమే ఆగిపోయారు. అంతమాత్రాన ఆమె ‘అన్‌స్టాపబుల్‌ కాకుండా పోరు. టెన్నిస్‌లో రాణించడానికి షరపోవా ఎంత కష్టపడ్డారో టెన్నిస్‌ తర్వాత లైఫ్‌లోనూ ఎదగడానికి అంతగా కృషిచేస్తారని అంచనా వేయడానికి ఆమె కెరీర్‌లోని మలుపులే కొలమానాలు.

రిటైర్‌మెంట్‌ను ప్రకటించిన షరపోవా గురించి తెలుసు కోవాల్సిన వివరాలు అనేకం ఉన్నాయి. కెరీర్‌ కోసం దేశం కాని దేశానికి వెళ్లి, ఆటలో రాణించారు. రెండుదేశాలకు గర్వకారణంగా నిలిచారు. మహిళలకు ఆదర్శంగా నిలిచారు. సుగర్‌పోవా అనే క్యాండీ కటి ఉంది. అది అమెరికాలో దొరుకుతుంది. పిల్లలకు ఎంతో ఇష్టమైనది. ఫన్నీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే స్వీట్‌గా ఉంటుంది. క్యాండీల వ్యాపారి జెఫ్‌ రూబిన్‌..షరపోవా పేరు మీదే, ఆమెతో కలిసి సుగర్‌పోవా క్యాండీని సృష్టించాడు. దాని అమ్మకాలపై వచ్చే డబ్బు ‘షరపోవా చారిటీకి వెళుతుంది.

ఒక సందర్భంలోనైతే షరపోవా తన పేరును సుగర్‌పోగా మార్చుకోవాలని కూడా అనుకున్నారు! అంతగా ఆ ప్రాడెక్ట్‌ ఇమేజ్‌ పెరిగిపోయింది. ఆరేళ్ల వయసులో మాస్మోలోని మార్టిన్‌ నవ్రతిలోవా నడుపుతున్న టెన్నిస్‌ క్లినిక్‌లో చేరడం షరపోవా కెరీర్‌ను మలుపుతిప్పింది. మార్టినా ఈ చిన్నారిని ప్లారిడాలోని ఐఎంజి అకాడమీకి రికమండ్‌ చేసింది. ఆండ్రీ అగస్సీ, మోనికాసెలెస్‌, అన్నా కోర్నికోవా లాంటి టెన్నిస్‌ దిగ్గజాలు ట్రైనింగ్‌ తీసుకున్న అకాడమీ అది. కానీ షరపోవా తండ్రి దగ్గర డబ్బుల్లేవు.

అప్పుచేయాలి. అప్పు చేయాలి. డబ్బైతే అప్పు చేయగలడు కానీ, ఇంగ్లీషులో మాట్లాడలేదు కదా! ఇంట్లో ఎవ్వరికీ ఇంగ్లీష్‌ రాదు. ఆ భయంతో ఏడాది తాత్సారం చేసి ధైర్యం చేశాడు. మరోవైపు వీసా నిబంధనలు తండ్రీకూతుళ్లను మాత్రమే యుఎస్‌లోకి రానిచ్చాయి. తల్లి ఎలీనా రెండేళ్లపాటు భర్తకు, కూతురికి దూరంగా రష్యాలోనే ఉండిపోవలసి వచ్చింది. షరపోవా, ఆమె తండ్రి తొలిసారి అమెరికాలో అడుగుపెట్టే నాటికి వాళ్ల దగ్గరున్న డబ్బు 700 డాలర్లు. ఇప్పటి లెక్కల్లో సుమారు 47 వేలరూపాయలు. వాటిని జాగ్రత్తగా వాడుకుంటూనే ప్లారిడాలో ఇళ్లల్లో పాత్రలు కడగడం వంటి చిన్నచిన్న ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టాడు

తండ్రి. తర్వాత ఏడాదికల్లా అకాడమీ ప్రవేశానికి అర్హమైన తొమ్మిదేళ్ల వయసు రాగానే కూతుర్ని ఐఎంజిలో చేర్చాడు. ఇక షరపోవా ట్యూషన్‌ ఫీజు, ఇతర సదుపాయాలు, సౌకర్యాలు అన్నీ అకడమిక్‌ చూసుకునేది. అలా కెరీర్‌తోపాటు, షరపోవా జీవితం కూడా యుఎస్‌తో ముడిపడిపోయాయి. ఆటల్లోనే కాదు, చారీటీల్లో కూడా ఆమె పెద్ద సెలబ్రిటీ అయ్యారు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ముందు డ్రగ్‌ టెస్ట్‌ చేసినప్పుడు ఆమె ఒంట్లో ‘మెల్డోనియం అనే మందు బయటపడింది.

అదేమీ నిషేధించిన ఔషధం కాదు. అప్పటికి పదేళ్లుగా ఆమె తన ఆరోగ్యం కోసం తనకు తెలియకుండానే మెల్డోనియం కలిసి ఉన్న మెడిసిన్‌ని వాడుతున్నారు. వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీకొత్తగా విడుదల చేసిన నిషేధిత ఔషధాలలో దానిని కూడా చేర్చడంతో షరపోవా దోషికావలసి వచ్చింది. అందుకు పడిన శిక్ష ఆట నుంచి పదిహేను నెలల బ్యాన్‌. షరపోవా రష్యన్‌ ప్రొఫెషనల్‌ ప్లేయర్‌. ఇరవై ఐదేళ్లుగా యుఎస్‌లో ఉంటున్నారు. ఒలింపిక్‌ మెడలిస్ట్‌. టెన్నిస్‌ కోర్టులో గర్జించే సింహం. 6 అడుగుల 2 అంగుళాల ఎత్తైన మనిషి.

ఆమెకు మాత్రమే ప్రత్యేకమైన ఆ స్వింగింగ్‌ వ్యాలీలు ప్రత్యర్థుల గుండెల్ని కిందికి జారుస్తాయి. ఒక ఆట గెలచినప్పుడు షరపోవా వెంటనే తర్వాతి ఆటకు ప్రాక్టీస్‌ మొదలుపెడతారు. ఆటలో ఓడిపోయినప్పుడు ఆ ఒత్తిడి నుంచి బయట పడడానికి షాపింగ్‌కి వెళతారు.

Sharapova

పుట్టుపూర్వోత్తరాలు

సోవియెట్‌ యూనియన్‌లో చెర్నోబిల్‌ అణు ప్రమాదం సంభవించిన తర్వాత ఏడాదికి న్యాగన్‌ పట్టణంలో షరపోవా పుట్టింది. ఆ పట్టణం చెర్నోబిల్‌ దుర్ఘటన జరిగిన ప్రిష్యత్‌ పట్టణానికి 3,500 కి.మీ దూరంలో ఉంటుంది. చెర్నోబిల్‌ ప్రమాద ప్రభావం పడకుండా ఉండేందుకు షరపోవా తల్లిదండ్రులు ప్రిష్యత్‌ నుంచి ఎంత దూరంగా వీలైతే అంత దూరంగా వెళ్లిన తర్వాతే బిడ్డను కనాలని నిర్ణయించుకుని న్యాగన్‌లో తలదాచుకున్నారు. చెర్నోబిల్‌ ప్రమాదం 1986 ఏప్రిల్‌ 26న జరిగింది.

ముప్ఫైఏళ్ల తర్వాత మళ్లీ అదే రోజున నిషేధం తర్వాత షరపోవా తన ‘రీబర్త్‌ టెన్నిస్‌ను ఆడారు. పద్దెనిమిద యేటే టెన్సిన్‌లో ఆమె వరల్డ్‌ నెం.1 ర్యాంకులోకి వచ్చేశారు. అదే ఏడాది 18వ బర్త్‌డే పార్టీలో అమెరికన్‌ పాప్‌ రాక్‌ బ్యాండ్‌ మెరూనక్ష 5 సింగర్‌ ఆడమ్‌ లెవీన్‌ ఆమెకు పరిచయం అయ్యాడు. తర్వాత అమెరికన్‌ టెలివిజన్‌ ప్రొడ్యూసర్‌ చార్లీ ఎబర్సోల్‌ ఆమె జీవితంలోకి వచ్చాడు. తర్వాత స్లొవేనియా బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌నషా ఉజాసిక్‌, తర్వాత బల్గేరియన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ గ్రిగర్‌దిమిత్రోవ్‌. వీరంతా ఆమె జీవితంలోకి ప్రవేశించినవారే.

ప్రస్తుతం ఆమె బా§్‌ుఫ్రెండ్‌ అలెగ్జాండర్‌ గిల్కెస్‌. షరపోవా రిటైర్మెంట్‌ని ప్రకటించినప్పుడు ఆమె కెరీర్‌ను కొనియాడుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు. షరపోవా రెండేళ్ల వయసులో ఆమె కుటుంబం సోచ్‌ సిటీకి మారింది. అక్కడ ఆమె తండ్రికి అలెగ్జాండర్‌ కఫెల్నికోవ్‌ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అలెగ్జాండర్‌ తన పద్నాలుగేళ్ల కొడుకు ఎవ్‌జెనీకి టెన్నిస్‌లో శిక్షణ ఇప్పిస్తున్నప్పుడు వారి పరిచయం జరిగింది. తర్వాత రెండేళ్లకు తండ్రితో పాటు ఆట చూడడానికి వచ్చిన షరపోవాను చూసి ముచ్చట పడి ఆ చిన్నారికి కూడా ఓ టెన్నిస్‌ రాకెట్‌ కొనిచ్చాడు అలెగ్జాంగర్‌. అదే తొలిసారి షరపోవా రాకెట్‌ పట్టుకోవడం.

లోకల్‌పార్క్‌లో చాలాకాలం పాటు ఆ రాకెట్‌తోనే ఆడింది. తర్వాత రష్యన్‌కోచ్‌ యూరి యట్కిన్‌ దగ్గర టెన్నిస్‌ పాఠాలు నేర్చుకుంది. తొలి ఆటలోనే షరపోవాలోని అతి ప్రత్యేకమైన ‘హ్యండ్‌-ఐకో అర్డినేషన్‌ని గమనించాడు కోచ్‌. కోపంగా ఉన్నప్పుడు షరపోవా రాకెట్‌తో లాగిపెట్టి టెన్నిస్‌ బంతిని కొడతారు. అవతల ఎవరూ ఉండరు. ప్రాక్టీస్‌ వాల్‌ను పిడిగుద్దులు గుద్దినట్టుగా బంతిని వాల్‌ పైకి ఈడ్చి కొడుతూనే ఉంటారు. ఊరికినే తనకుకోపం రాదు. వస్తే ఊరికే ఉండిపోదు. కోపం తీర్చుకుంటుంది. ఎదురుగా ఉన్న గోడల్ని బంతులతో పగలడొడుతుంటారు.

బయోగ్రఫీ రాసారు:

పదిహేను నెలల నిషేధంలో షరపోవా యెగా, ధ్యానం సాధన చేశారు. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో చేరారు. మంచి మంచి బుక్స్‌చదివారు. బయోగ్రఫీ రాశారు. బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. ఆట నుంచి బ్యాన్‌ అవగానే చాలామందే చికాకు పరిచారు ఆమెను. మొదటగా డేవిడ్‌ హెగర్టీ! ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌. ఆమె బ్యాన్‌ నిర్ణయం అతడిదే. ఇంకా సాటి ప్లేయర్‌లు జాన్‌ మెకెన్రో, ప్యాట్‌ క్యాష్‌, జెన్నిఫర్‌ కాప్రియాటీ, సెరెనా విలియమ్స్‌, రోజర్‌ ఫెదరర్‌, రాఫెల్‌ నాదల్‌, ఆండీముర్రే, నొవాక జకోవిక్‌ తలో మాటా అన్నారు. ‘ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నాం అని ఒకరు, ‘తన టైటిళ్లనీ వెనక్కు తీసేసుకోవాలి అని ఒకరు,

‘సారీ చెప్పినా ఒు్పకోవద్దని ఒకరు తలో రాయి విసిరారు. షరపోవా ఎవరికీ సారీ చెప్పలేదు. వీళ్లందర్నీ క్షమించేయడానికి బాక్సింగ్‌ కన్నా, ధ్యానం ఆమెకు ఎక్కువ ఉపయోగపడింది. బాల్యం నుంచి దూరంగా వచ్చేస్తున్నకొద్దీ, బాల్యం ఆమె దగ్గరకు రావడం షరపోవా జీవితంలోని ఒక విశేషం. చిన్నపిల్ల నవ్వు, చిన్నపిల్ల వెక్కిరింపు ఇవెక్కడికీ పోలేదు.

ఆమె దగ్గర చిన్నప్పటి స్టాంప్‌ కలెక్షన్‌ ఇంకా పోగవుతూనే ఉంది. చిన్నప్పటి ఆమె జ్ఞాపకాల సుగంధ పరిమళం స్టెల్లా మెకార్ట్నీ ఎప్పుడూ ఆమెను అంటుకునే ఉంటుంది. పిప్పీ లాంగ్‌స్టాకింగ్‌ బుక్స్‌ కూడా ఇంకా చదువుతూనే ఉన్నారు షరపోవా.

పిప్పీ లాంగ్‌ స్టాకింగ్‌ అనేది స్వీడిష్‌ రచయిత్రి ఆస్ట్రిడ్‌ లిండ్‌గ్రెన్‌ నవలల్లోని ఒక అమ్మాయి క్యారెక్టర్‌. పిప్పీ జుట్టు ఎర్రగా ఉంటుంది. రెండు జడలు ఉంటాయి. స్ట్రాంగ్‌గా ఉంటుంది. సింగిల్‌ హ్యాండ్‌తో తన గుర్రాన్ని అదుపు చేస్తుంటుంది. చురుగ్గా ఉంటుంది. ఎప్పుడు చేస్తుందో చెప్పలేనంద ఎగ్జెటింగ్‌గా ఉంటుంది.
ఆ పాత్రలో తనను తను చూసుకున్నట్లుంది షరపోవా. అందుకే పిప్పీ అంటే ఆమెకు ఇష్టం. మిగతా పిల్లల సాహి త్యాన్ని కూడా షరపోవా ఆసక్తిగా చదువుతూ ఉంటుంది

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/