హైదరాబాద్ లో మరోసారి చెడ్డి గ్యాంగ్ హల్చల్ ..

గత కొద్దీ రోజులుగా సైలెంట్ గా ఉన్న చెడ్డి గ్యాంగ్..మరోసారి రాజధాని హైదరాబాద్ లో హల్చల్ చేసారు. వరుసగా నాల్గు ఇళ్లలో దోపిడీకి పాల్పడి నగదును , బంగారాన్ని ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కుంట్లూరు ప్రజాగుల్మహార్‌లో వరుసగా నాలుగు ఇళ్లలో చోరీ చేశారు. ఈ నాలుగు ఇళ్లలో దొంగతనానికి ముందు రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడినట్లు తెలుస్తుంది.

సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఈ నాల్గు ఇళ్లలకు తాళాలు వేసి ఉన్నట్లు రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విలియంసన్ అనే వ్యక్తి ఇంట్లో 7.5 తులాల బంగారం, 80 తులాల వెండి,10వేల నగదు అపహరణ చేసారు. మొత్తం మూడు ఇళ్లలో చోరీ విఫలయత్నం చేయగా విలియంసన్ అనే వ్యక్తి ఇంట్లో మాత్రం బంగారం నగలు దొంగిలించారు. గ్రేటెడ్ కమ్యూనిటీలో చెడ్డి గ్యాంగ్ సంచరిస్తుండగా సీసీ కెమెరాలు రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.