టిక్‌టాక్ దుర్గారావుకు అదిరిపోయే ఆఫర్

టిక్‌టాక్ దుర్గారావుకు అదిరిపోయే ఆఫర్

సోషల్ మీడియా ప్రభావం జనంపై ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇటీవల సోషల్ మీడియాలో చాలా మంది తమ ట్యాలెంట్‌ను నిరూపించుకుని సినిమా ఛాన్సులు దక్కించుకుంటున్నారు. కాగా గతంలో టిక్‌టాక్ యాప్ ద్వారా సాధారణ జనం కూడా తమలోని ట్యాలెంట్‌ను బయటపెట్టే ప్రయత్నం చేశారు. కాగా చాలా మంది అందులో ఫేమస్ కూడా అయ్యారు. అయిటే తెలుగు రాష్ట్రాల్లో టిక్‌టాక్ స్టార్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పేరు దుర్గారావు.

తనదైన స్టెప్పులతో తన భార్యతో కలిసి దుర్గారావు చేసిన టిక్‌టాక్ వీడియోలకు అదిరిపోయే క్రేజ్ లభించింది. ఆయన వీడియోలకు లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తుండటంతో దుర్గారావు చాలా తక్కువ సమయంలో ఫేమస్ అయిపోయాడు. ఇక టిక్‌టాక్ తీసుకొచ్చిన పాపులారిటీని టీవీ షోలో ఎంట్రీ కోసం వాడుకున్నాడు దుర్గారావు. కాగా తాజాగా దుర్గారావుకు ఓ అదిరిపోయే ఆఫర్ వచ్చి పడింది. మాస్ రాజా రవితేజ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న క్రాక్ చిత్రంలో దుర్గారావుకు ఓ చిన్న పాత్ర చేసే అవకాశం లభించింది.

ఇది దుర్గారావుకు నిజంగానే అదిరిపోయే ఛాన్స్ అని చెప్పాలి. క్రాక్ చిత్రంలో గనక ఆయన తన పర్ఫార్మెన్స్‌తో క్లిక్ అయితే, ఇక వరుసగా సినిమా ఛాన్సులు వచ్చిపడతాయి. ఏదేమైనా సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మందికి సినిమా ఛాన్సులు వస్తుండటంతో ఇండస్ట్రీకి సరికొత్త ట్యాలెంట్ దొరికినట్లు అయ్యిందని పలువురు కామెంట్ చేస్తున్నారు.