డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ వేల మంది
రాత్రి 11 గంటల నుంచి నేటి తెల్లవారు జాము 4.30 వరకూ తనిఖీలు

Hyderabad నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గురువారం రాత్రి తాగి వాహనాలు నడుపుతున్న దాదాపు నాలుగు వేల మంది డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డారు.
పోలీసు శాఖ ముందుగానే చాలా స్ట్రిక్ట్ గా డ్రంకన్ డ్రైవ్ నిర్వహిస్తామని హెచ్చరికలుజారీ చేసినా వేల సంఖ్యలో మందుబాబులు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడటం గమనార్హం. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వారి సంఖ్య నాలుగు వేలకు పై మాటేనని పోలీసులు చెబుతున్నారు.
నిన్న రాత్రి 11 గంటల నుంచి నేటి తెల్లవారు జాము నాలుగున్నర వరకూ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/