బాలయ్యను రిజెక్ట్ చేసిన హీరో.. ఎవరో తెలుసా?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో బాలయ్య పర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలో బాలయ్యతో పాటు భారీ తారాగణం ఉండబోతుందని, ముఖ్యంగా ఓ కీలక పాత్రలో ఓ యంగ్ హీరో సినిమాకు మేజర్ అసెట్ కానుందని చిత్ర యూనిట్ అంటోంది.

అయితే ఈ సినిమాలో యంగ్ హీరో పాత్ర కోసం చాలా మందిని సంప్రదించారట చిత్ర యూనిట్. ఇందులో భాగంగా యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్‌ను ఆ పాత్ర చేయాల్సిందిగా దర్శకుడు బోయపాటి శ్రీను కోరాడట. కానీ ఈ ఆఫర్‌ను నిఖిల్ రిజెక్ట్ చేశాడట. ప్రస్తుతం తనకున్న ప్రాజెక్టుల కారణంగా ఈ సినిమా చేయలేనని చెప్పాడట. దీంతో ఈ పాత్రలో నటించేందుకు ఆది పినిశెట్టి, నారా రోహిత్‌లను సంప్రదించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

మొత్తానికి బాలయ్య నటిస్తున్న సినిమాలో ఆఫర్‌ను నిఖిల్ రిజెక్ట్ చేయడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. కాగా బాలయ్య ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండగా, అందులో ఒకటి అఘోరా పాత్ర ఉందని చిత్ర యూనిట్ తెలిపింది. మరో పాత్రలో బాలయ్య రైతుగా కనిపిస్తాడని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాలో మలయాళ బ్యూటీ ప్రగ్యా మార్టిన్ హీరోయిన్‌గా నటిస్తోన్నట్లు తెలుస్తోంది.