టిక్‌టాక్‌ వీడియో తీసే క్రమంలో యువకుడు మృతి

భుజంపై గన్ను పెట్టుకుని ఫోజిస్తుండగా గన్ను పేలి తూటా కణతలోకి దూసుకుపోయింది

young-boy-dead-during-tik-tok-video-shoot-with-pistol
young-boy-dead-during-tik-tok-video-shoot-with-pistol

బరేలీ: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో సోమవారం దారుణం జరిగింది. టిక్‌టాక్‌ వీడియో తీసే క్రమంలో యువకుడు మృతి చెందాడు. ముడియా బికంపూర్‌ గ్రామానికి చెందిన కేశవ్‌ కుమార్‌ పన్నెండో తరగతి చదువుతున్నాడు. అతడి తండ్రి ఆర్మీలో సేవలందిస్తున్నారు. కాగా నిన్న సాయంత్రం 5 గంటలకు కేశవ్‌ టిక్‌టాక్‌ వీడియో తీసేందుకు సిద్దమయ్యాడు. తల్లితో పేచీ పెట్టుకుని మరీ తుపాకీ తీసుకున్నాడు. భుజంపై గన్ను పెట్టుకుని ఫోజిస్తుండగా చేతిలోని గన్ను పేలి తూటా అతడి కుడి కణతలోకి దూసుకుపోయింది. గదిలో రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉన్న కొడుకుని చూసి ఒక్కసారిగా తల్లి షాకైపోయింది. వెంటనే తేరుకొని కేశవ్‌ను ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందాడు. గన్ను ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పినా వినకపోయే సరికి గన్ను చేతికి ఇచ్చి వంటింట్లోకి వెళ్లానని. ఇంతలోనే దారుణం జరిగిపోయిందని తల్లి సావిత్రి దేవి కన్నీరుమున్నీరయ్యారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/