జార్ఖండ్‌లో వాయిదా పడిన మంత్రివర్గ విస్తరణ

జార్ఖండ్‌లో వాయిదా పడిన మంత్రివర్గ విస్తరణ

రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కేబినెట్ విస్తరణ వాయిదా పడినట్టు రాజ్‌భవన్ నుచి ఒక ప్రకటన వెలువడింది. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ శుక్రవారమే మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉంది. అయితే పశ్చిమ సింగ్భూమ్జీ జిల్లాలో పాతాల్‌గర్హి ఉద్యమ మద్దతుదారులు ఏడుగురు గ్రామస్థులను మట్టుబెట్టిన ఘటన తనను తీవ్ర విచారంలో ముంచెత్తిందని, మంత్రివర్గ విస్తరణ వాయిదా వేయాలని గవర్నర్ ద్రౌపది ముర్ముకు ముఖ్యమంత్రి సోరెన్ చేసిన విజ్ఞప్తి మేరకు మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/