సోనియా సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్న తుమ్మల..?

సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అయ్యారు. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ తో భేటీ అయినా తుమ్మల..ఈ నెల 17 న హైదరాబాద్ లో జరగబోతున్న కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తుంది.

వాస్తవానికి తుమ్మల..ఈసారి బిఆర్ఎస్ టికెట్ వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూసారు. కానీ కేసీఆర్ మాత్రం తుమ్మలకు కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే కే టికెట్ కేటాయించడం..తుమ్మలకు ఎక్కడ కూడా టికెట్ ఇవ్వకపోవడం తో నిరాశకు లోనయ్యారు. ఇదే క్రమంలో తన అనుచరులు సైతం పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరాలని ఒత్తిడి తేవడం..కాంగ్రెస్ సైతం పాలేరు టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడం తో కాంగ్రెస్ లో చేరేందుకు డిసైడ్ అయ్యారు.

ఆదివారం హైదరాబాద్ లో కాంగ్రెస్ భారీ సభ జరగనుంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకతో పాటుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతలు హైదరాబాద్ తరలి రానున్నారు. వారి సమక్షంలోనే తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం.