ఈవీఎంలో కారు గుర్తు చెరిపేసిన దుండగులు

తెలంగాణాలో సోమవారం లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 17 లోక్ సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఎప్పటిలాగానే ఈసారి కూడా లోక్ సభ ఎన్నికల ఫై ఓటర్లు పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేదు.ఎక్కడ కూడా 85 శాతం ఓటింగ్ జరగలేదు. హైదరాబాద్ పరిధిలో చాల దారుణంగా పోలింగ్ శాతం నమోదైంది. కేవలం 40 శాతం వరకే నమోదైంది.

ఇదిలా ఉంటె ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. ఈవీఎంలో కారు గుర్తు చెరిపేశారు కొంత మంది దుండగులు. గద్వాల జిల్లా పైపాడులో ఈ వివాదం తెరపైకి వచ్చింది. గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడులోని పోలింగ్ బూత్ నంబరు 167లో ఈవీఎంలో కారు గుర్తు కనిపించకుండా మార్క ర్‌తో రుద్దడంతో వివాదం నెలకొంది. ఈ బూత్ లో మొత్తం 1,196 ఓట్లు ఉండగా 848 ఓట్లు పోలైన తర్వాత వచ్చిన ఓటరు దీనిని గమనించి అధికారులకు తెలియ జేశారు.బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలింగ్ బూత్ వద్దకు వచ్చి సిబ్బందితో మాట్లాడి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.