తరగతి గదిలో విద్యార్థి కొంటె పనిచేశాడని..బాల్కనీ నుంచి తలకిందులుగా వేలాడదీసిన ప్రిన్సిపాల్

తరగతి గదిలో విద్యార్థులు ఏమైనా తప్పు చేస్తే ..బెదిరించాలి కానీ ఏకంగా బాల్కనీ నుంచి తలకిందులుగా వేలాడదీసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. మీర్జాపూర్‌లోని అహ్రారాలోని సద్భావన శిక్షణ సంస్థాన్ జూనియర్ ప్రైవేట్ స్కూలుకు చెందిన 2వతరగతి విద్యార్థి తరగతి గదిలో కొంటె పని చేశాడని ప్రిన్సిపాల్ మనోజ్ విశ్వకర్మ అతన్ని పాఠశాల భవనం మొదటి అంతస్తులోని బాల్కనీ నుంచి తలకిందులుగా వేలాడదీశాడు.

స్కూల్ పిల్లలు అంత చూస్తుండగా..దాదాపు పది నిమిషాల పాటు అలాగే తలకిందులుగా వేలాడదీసాడు. ఆ విద్యార్థి క్షమించమని వేడుకోవడంతో ప్రిన్సిపాల్ అతన్ని పైకి లాగాడు. ఈ ఘటన పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ కావడంతో అతనిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించాలని మీర్జాపూర్ జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.దీంతో పోలీసులు ప్రిన్సిపాల్ మనోజ్ విశ్వకర్మపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు.