ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌ పుల్వామా జిల్లా కంగన్‌ ప్రాంతంలో ఘటన

encounter
encounter

జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌ పుల్వామా జిల్లా కంగన్‌ ప్రాంతంలో ఎదురు కాల్పుల్లు జరిగాయి. ఈకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఉగ్రవాదుల ఆచూకీకి ఆర్మీ సిబ్బంది, స్థానిక పోలీసులు కంగన్‌ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య ఈ తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. సంఘటనా స్థలం నుంచి ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జమ్ముకశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/