తన పదవి తొలగింపు పై స్పందించిన స‌చిన్ పైల‌ట్

నిజాన్ని ఓడించలేరని సచిన్ ట్వీట్

sachin-pilot

జైపూర్ : కాంగ్రెస్ హైకమాండ్ స‌చిన్ పైల‌ట్ ను ప్యూటీ సీఎం ప‌ద‌వి నుంచి తొల‌గించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై స‌చిన్ పైల‌ట్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. ‘సత్యాన్ని వక్రీకరించగలరేమో కానీ.. దాన్ని ఓడించలేరు’ అని ఆయన ట్వీట్ చేశారు. ఇక ట్విటర్ ఖాతాలో తన బయోడేటాను అప్‌డేట్ చేశారు సచిన్ పైలట్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్, రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ పదాలను తొలగించి.. టోంక్ ఎమ్మెల్యే అని మాత్రమే పేర్కొన్నారు. మరోవైపు సచిన్ కు బీజేపీ నుంచి ఆహ్వానం అందే అవకాశాలు ఉన్నాయి. ఈ సాయంత్రంలోపు తన భవిష్యత్ కార్యాచరణపై ఆయన స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు పీసీసీ పదవి నుంచి సచిన్ ను తొలగించిన వెంటనే ఆయన స్థానంలో గోవింద్ సింగ్ దోతస్త్రాను నియమించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/news/international-news/