గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న కారు


హైదరాబాద్ : హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సినీ జూనియర్ ఆర్టిస్టులు సహా ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో హెచ్‌సీయూ రోడ్డులో వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ప్రమాదంలో డ్రైవర్, ఇద్దరు సినీ జూనియర్ ఆర్టిస్టులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మరో జూనియర్ ఆర్టిస్ట్ అయిన సిద్ధు గాయపడ్డాడు. మృతి చెందిన వారిని మానస (22), మానస (21), అబ్దుల్లాగా గుర్తించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన జూనియర్ ఆర్టిస్టులు అమీర్‌పేటలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/