మూడేళ్లలో మీరు రాష్ట్రానికి ఏం చేశారు?: మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్

కాంగ్రెస్ తనను 91 సార్లు తిట్టిందన్న మోడీ ఆరోపణపై రాహుల్ గాంధీ

‘This election is not about you’: Rahul Gandhi hits out at PM

బెంగళూరుః కాంగ్రెస్ పార్టీ తనను 91 సార్లు తిట్టిందని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికలు మోడీ కోసం కాదని, ప్రజల కోసమని, ఆ విషయం ఆయన తెలుసుకోవాలని హితవుపలికారు.

ఈ రోజు తుమకూరు జిల్లా తురువెకెరెలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడారు. ‘‘కర్ణాటక ఎన్నికల ప్రచారానికి మీరు (మోడీ) వస్తారు. కానీ కర్ణాటక గురించి మాట్లాడరు. కేవలం మీ గురించి మాత్రమే మాట్లాడతారు. మూడేళ్లలో మీరు రాష్ట్రానికి ఏం చేశారు? వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తారు? యువత, విద్య, ఆరోగ్యం, అవినీతిపై పోరాటం విషయంలో ఏం చేస్తారనేది చెప్పాలి’’ అని సూచించారు. ‘‘ఈ ఎన్నికలు మీ కోసం కాదు. కర్ణాటక ప్రజలు, వారి భవిష్యత్తు కోసం. కాంగ్రెస్ మిమ్మల్ని 91 సార్లు తిట్టిందని చెబుతారు. కానీ మీరు రాష్ట్రానికి ఏం చేశారనేది మాత్రం చెప్పరు. కనీసం తర్వాతి ప్రసంగంలోనైనా మీరేం చేశారు? ఏం చేయబోతున్నారు? అనేది చెప్పండి’’ అని ఎద్దేవా చేశారు.

ప్రసంగాల్లో కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్