RT69 ఫస్ట్ లుక్ విడుదల

RT69 ఫస్ట్ లుక్ విడుదల

మాస్ మహారాజ రవితేజ – త్రినాధ్ నక్కిన కలయికలో #RT69 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 4వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నట్లు ప్రకటించారు. ఇక పోస్టర్‌లో రవితేజా చీకట్లో రవితేజా ఆకారాన్ని మాత్రమే చూపించారు. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాకర్టీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు.

ఈ ఏడాది ‘క్రాక్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ.. ప్రస్తుతం రమేశ్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీంతో పాటు శరత్ మండవా దర్శకత్వంలో ‘రామారావు అన్‌డ్యూటీ’ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. కొన్ని వాస్తవకథల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.