తెలంగాణ కొత్త సచివాలయంలో దొంగలు పడ్డారు..

తెలంగాణ కొత్త సచివాలయంలో దొంగలు పడ్డారనే విషయం ఇప్పుడు మీడియా లో వైరల్ గా మారింది. రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం పేరుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ ఖర్చుతో నిర్మించింది. 28 ఎకరాల్లోని విశాల స్థలంలోని 7,79,982 చదరపు అడుగులు విస్తీర్ణంలో 265 అడుగుల ఎత్తుతో భవనం నిర్మించారు. అలాంటి ఈ సచివాలయంలో దొంగలు పడడం ఇప్పుడు వార్తల్లో వైరల్ గా మారింది.

సచివాలయం పక్కన మీడియా సెంటర్‌లో ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. వర్క్ నడుస్తున్నంత సేపు అక్కడ సిబ్బంది ఉంటున్నారు కానీ.. ఆ తర్వాత ఎవరూ ఆ ప్రదేశంలో అడ్రస్ కనిపించరు. దీన్నే అదనుగా చేసుకున్న దొంగలు ఈ ప్రదేశంలోకి చొరబడ్డారు. ఒకరా ఇద్దరు కాదు ఏకంగా ఐదారుగురు మీడియా సెంటర్‌లోకి వచ్చి దొరికినవన్నీ ఎత్తుకెళ్లారు. ఇలా జరగడం ఇవాళేం కొత్తేం కాదట. నిత్యం ఇక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి. అయితే.. మీడియాకు తెలియకుండా అధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పటి వరకూ వేల రూపాయిలు విలువ చేసే కరెంటు వైర్లు, రాడ్లు, స్విచ్ బోర్డులు, ఎల్ఈడీ లైట్లు ఎత్తుకెళ్లారు. నిన్న ఒక్కరోజే పదివేలకు పైగా విలువ చేసే సామాగ్రి అపహరణకు గురికావడం గమనార్హం.